ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనింగ్‌కు ఉన్న డిమాండ్, క్రేజ్ ఏ రంగానికి లేదు. ముఖ్యంగా లేడీ ఫ్యాషన్ డిజైనర్స్‌కు.. కొత్త కొత్త డ్రెస్సులను డిజైన్ చేసేవాళ్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే.. ఏ డిజైన్ అయినా కూడా దాన్ని డిజైన్ చేసేటప్పుడు కొన్ని పరిమితులను దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేస్తారు.
కానీ.. ఈ మమిళ చూడండి.. చీర కట్టుకుంది కానీ.. జాకెట్ వేసుకోలేదు. ఫోటోలో చూస్తే మాత్రం జాకెట్ వేసుకున్నట్టే ఉంటుంది. పరీక్షించి చూస్తే.. అది జాకెట్ కాదు.. మెహందీతో తన బాడీ మీద వేసుకున్న బ్లౌజ్ డిజైన్.
ప్రస్తుతం ఈ మహిళ మెహందీతో వేసుకున్న బ్లౌజ్‌కు సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మామూలుగా మెహందీని చేతులకు, కాళ్లకు వేసుకుంటారు కానీ.. ఇలా బ్లౌజ్లా శరీరానికి వేసుకోవడం మాత్రం ఇదే ఫస్ట్ టైమ్.
దూరం నుంచి చూస్తే.. తను నిజంగానే బ్లౌజ్ వేసుకున్నట్టు కనిపిస్తుంది కానీ.. దగ్గరికి వెళ్తే కానీ.. తెలియదు అసలు తను బ్లౌజే వేసుకోలేదని. అయితే.. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు చూసిన నెటిజన్లు మాత్రం తీవ్రస్థాయిలో ఆ మహిళపై ఫైర్ అవుతున్నారు.
దేనికైనా ఒక హద్దు ఉంటుంది. హద్దులు మీరితే మంచిగా ఉండదు. ఎంత ఫ్యాషన్ పిచ్చి ఉంటే మాత్రం ఇలా చేస్తారా? అంటూ ఆ మహిళపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
వ్యాక్సిన్ వేయించుకుంటే డేటింగ్ చేస్తా.. యువతి బంపర్ ఆఫర్.. ఎక్కడో తెలుసా?
jayabharathi |ఆడవాళ్లు డ్రైవింగ్ నేర్చుకుని ఏం చేస్తారనే ప్రశ్నకు ఇదే నా జవాబు
3 అడుగుల వరుడు.. 2 అడుగుల వధువు.. 7 అడుగుల బంధం
అరుదైన రెండు తలల బల్లిని చూశారా ఎప్పుడైనా?.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో
అలియా భట్ లెహంగా అడ్డొస్తుందని రణ్‌బీర్ ఏం చేశాడో తెలుసా? వైరల్ వీడియో