ప్రస్తుతం ప్రపంచమంతా కరోనాతో ఫైట్ చేస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోని చాలా మంది ప్రజలు వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇంకా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. వ్యాక్సిన్ వేసుకోని వాళ్లను కూడా వేసుకోవాలని ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. నూటికి నూరు శాతం వ్యాక్సిన్ వేసుకుంటే.. తీవ్ర ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు.
అయితే.. కొందరు కావాలని కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం లేదు. కొందరు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇంకొందరు వ్యాక్సిన్ వల్ల ఏం ఉపయోగం ఉండదని కొట్టిపారేస్తున్నారు. ఈనేపథ్యంలో ఓ యువతి తనతో డేటింగ్ చేయాలనుకున్న వాళ్లకు ఓ కండిషన్ పెట్టింది.
వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లతోనే తాను డేటింగ్ చేస్తానంటూ ప్రకటించింది. తను కలిసిన వాళ్లను వ్యాక్సిన్ వేసుకోవాలంటూ చెప్పడంతో పాటు.. వ్యాక్సిన్ వేసుకుంటే డేటింగ్ చేస్తానంటూ బంపర్ ఆఫర్ ప్రకటించింది.
టిక్‌టాక్‌లో ఓ యువతి.. తన రూమ్మెట్ వీడియోను పోస్ట్ చేసింది. తను నా రూమ్మెట్. అబ్బాయిలు ఎవరైనా కనిపిస్తే చాలు.. వాళ్లను వ్యాక్సిన్ వేసుకున్నారా అని అడుగుతుంది. వేసుకోలేదు అంటే.. వ్యాక్సిన్ వేసుకుంటే డేటింగ్ చేస్తా అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించేది. వాళ్లు వ్యాక్సిన్ వేసుకున్నాక.. అంతా ఉత్తుత్తే అంటూ వాళ్లను ఆటపట్టించేది.. అంటూ వీడియోను పోస్ట్ చేసింది.
ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే.. ఆ యువతి.. తనకు తోచిన సోషల్ సర్వీస్ చేస్తూ.. వ్యాక్సిన్‌పై అవగాహన కల్పిస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తన ఐడియాకు అందరూ ఫిదా అయిపోతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
jayabharathi |ఆడవాళ్లు డ్రైవింగ్ నేర్చుకుని ఏం చేస్తారనే ప్రశ్నకు ఇదే నా జవాబు
3 అడుగుల వరుడు.. 2 అడుగుల వధువు.. 7 అడుగుల బంధం
అరుదైన రెండు తలల బల్లిని చూశారా ఎప్పుడైనా?.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో
అలియా భట్ లెహంగా అడ్డొస్తుందని రణ్‌బీర్ ఏం చేశాడో తెలుసా? వైరల్ వీడియో