ఒంటరితనం.. గుండెకు చేటు
ఒంటరితనం.. గుండెజబ్బులకు దారితీస్తున్నది. నలుగురితో కలిసిమెలిసి ఉండేవారికి.. హృదయ సమస్యల నుంచి రక్షణ లభిస్తున్నది. దీర్ఘకాలిక ఒంటరితనంతో ఒత్తిడి, దానితోపాటే రక్తపోటు, ఇన్ఫ్లమేషన్, కార్టిసాల్ స్థాయులు పెరగడం.. గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఒంటరితనం.. గుండెజబ్బులకు దారితీస్తున్నది. నలుగురితో కలిసిమెలిసి ఉండేవారికి.. హృదయ సమస్యల నుంచి రక్షణ లభిస్తున్నది. దీర్ఘకాలిక ఒంటరితనంతో ఒత్తిడి, దానితోపాటే రక్తపోటు, ఇన్ఫ్లమేషన్, కార్టిసాల్ స్థాయులు పెరగడం.. గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక సామాజిక ఒంటరితనంతో చాలామందిలో ధూమపానం అలవాటు పెరుగుతున్నదట. బయటి ఆహారం తీసుకోవడం, వేళాపాళా లేని తిండివల్ల ఊబకాయం లాంటివీ పలకరిస్తున్నాయట. అదే సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు ఉండటం వల్ల.. తెలియకుండానే కొన్ని మంచి అలవాట్లు అలవడతాయి. స్నేహితులతో వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం గురించి చర్చించుకోవడం, ధూమపానం-మద్యం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా ప్రోత్సహించుకోవడం.. ఫలితంగా, చురుకైన జీవనశైలి అలవాటు అవుతుంది.
స్థిరమైన మానసిక స్థితి, కంటినిండా నిద్ర కూడా లభిస్తుంది. ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి. దీనివెనక ఉన్న కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆనందంగా గడిపినప్పుడు.. శరీరంలో కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ తగ్గుతుంది. ఫలితంగా రక్తపోటు అదుపులో ఉంటుంది. అదే సమయంలో ఆక్సిటోసిన్ అనే ‘లవ్ హార్మోన్’ కూడా విడుదలవుతుంది. ఇది రక్తనాళాలను వ్యాకోచింపజేసి.. రక్త ప్రసరణ సజావుగా సాగేలా చేస్తుంది. ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇక జీవితంలో కష్టనష్టాలు కామన్. అలాంటివి ఎదురైనప్పుడు మీకు అండగా నిలిచేవారు మీ చుట్టూ ఉంటే.. మీ గుండెకు ఎంతో భరోసా దక్కినట్లు అనిపిస్తుంది. ఆందోళన తగ్గుతుంది. గుండెపోటు లాంటివి రాకుడా ఉంటాయి. సామాజిక మద్దతు ఉన్నవారిలో హృదయ స్పందన రేటు త్వరగా సాధారణ స్థితికి వస్తుందని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

