హైదరాబాద్: వెనుకటికి నిప్పులతో కట్టెల పొయ్యి అంటించేవాళ్లు. తాతలు చుట్టలు ముట్టించుకునే వాళ్లు. ఇప్పటికీ కొందరు ఇస్త్రీ చేసేందుకు నిప్పులు వాడితే, మరికొందరు ఊదుపొగ వేసేందుకు నిప్పులు వినియోగిస్తున్నారు. అంతేతప్ప నిప్పులతో అస్సలు చెలగాటమాడరు. కానీ ఓ మహిళ మాత్రం నిప్పులను ట్యాబ్లెట్లు వేసుకున్నట్లు టకాటకా నోట్లో వేసుకుంది. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి ప్రవీణ్ శర్మ ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. నెటిజన్ల నుంచి లైకులు, కామెంట్ల వర్షం కురుస్తున్నది.
ఈ వీడియోలో ఓ యుక్త వయసు మహిళ కుర్చీలో తాపీగా కూర్చుని ఉంది. తన ఎదురుగా టేబుల్‌పైన ఒక ప్లేట్లో మండుతున్న నిప్పులు ఉన్నాయి. ఆ నిప్పులతో ఏం చేయబోతుందా..? అని ఆలోచించే లోపే ఆమె ఒక్కొక్కటిగా ఆ మండుతున్న నిప్పు కణికలను నోట్లో వేసుకోవడం మొదలుపెట్టింది. అలా కేవలం 30 సెకండ్ల వ్యవధిలోనే ఆమె ఐదు నిప్పురవ్వలను ట్యాబ్లెట్లలా నోట్లో వేసుకుంది.
ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ఐపీఎస్ ప్రవీణ్ శర్మ సరదా క్యాప్షన్లు ఇచ్చారు. అవిరిపట్టిన తర్వాత..! ఉప్పునీటిని పుక్కిలించిన తర్వాత..! పసుపు కలిపిన పాలు తాగిన తర్వాత..! ప్రతిరోజు గోరువెచ్చని నీళ్లు తాగిన తర్వాత..! ఇక ఆఖరి ఆప్షన్ ఇదే..! కరోనా జీవితం భస్మం అయిపోతది..! అని పేర్కొన్నారు. ఆ వెంటనే ఈ ప్రయత్నం అస్సలు చేయొద్దు.. వ్యాక్సిన్ వేసుకోండి బాస్ అని సూచించారు.
After taking Steam..!
— Rupin Sharma (@rupin1992) May 8, 2021
After doing Gargling with SaltWater..!
After drinking Milk with Turmeric..!
After Drinking Hot Water Everyday..!
This is the Last Option Available..!
कोरोना जिंदा भस्म हो जाएगा…#DONT_TRY_THIS AT ALL.#VACCINE LAGAO BAS.@hvgoenka pic.twitter.com/2UFxZLbFAk
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ట్రయల్స్‌లో సత్ఫలితాలిస్తున్న 2-డీజీ డ్రగ్: డీఆర్డీవో శాస్త్రవేత్త
301 జిల్లాల్లో 20 శాతానికిపైగా పాజిటివిటీ రేటు: కేంద్రం
కాబూల్ పేలుళ్లు: 50 దాటిన మృతుల సంఖ్య
క్షణికావేశంలో భార్యను చంపి భర్త ఆత్మహత్య
పండ్లలో విటమిన్.. ఇమ్యూనిటీ పెంచెన్
మైదా పిండి.. కొడుతుందట ఆరోగ్యానికి గండి..!
మహమ్మారి మరణ మృదంగం.. వరుసగా రెండో రోజూ 4 వేలకుపైగా మృతులు
గోమూత్రం తాగండి.. కరోనాను నిలువరించండి: బీజేపీ ఎమ్మెల్యే సలహా