Daddys Home : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన చేష్టలతోనే కాదు మాటలతోనూ ఈమధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. భారత్, పాకిస్థాన్‌ల మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ గొప్పలు చెప్పుకుంటున్న ట్రంప్.. తాజాగా ఇజ్రాయేల్ – ఇరాన్ మధ్య శాంతిదూత కూడా తానేనని గర్వంగా అంటున్నారు. ఇరాన్‌పై దాడి నుంచి పశ్చిమాసియాలో సయోధ్య కుదిరేవరకూ నెట్టింట ట్రెండ్ అయిన ట్రంప్.. మరోసారి వైరలవుతున్నారు. అయితే.. ఈసారి ఆయన కొత్త నిక్‌నేమ్‌తో శ్వేత సౌధం విడుదల చేసిన వీడియో ఇది. ఇంతకూ ఆ కొత్త పేరు ఏంటో తెలుసా.. డాడీ(Daddy).
నాటో అధ్యక్షుడు మార్క్ రుటే(Mark Rutte) సరదాగా ట్రంప్‌ను డాడీ అని సంబోధించాడు. ఇరాన్ – ఇజ్రాయేల్ మధ్య కాల్పుల విరమణ అంశంపై అమెరికా ప్రెసిడెంట్ మాట్లాడుతుండగా మార్క్.. ఆయను జోక్‌గా డాడీ అని అన్నారు. గురువారం వైట్‌హౌస్ విడుదల చేసిన ఒక నిమిషం నిడివి ఉన్న వీడియోతో ట్రంప్ కొత్త నిక్‌నేమ్ క్షణాల్లో వైరలైంది. 2010లో అమెరికా సింగర్ ఉషెర్ (Usher) ‘డాడీ’ పేరుతో వీడియో చేశాడు. నాటో సమావేశంలో చీఫ్ మార్క్ ట్రంప్‌ను డాడీ అని నిక్‌నేమ్‌తో పిలిచినందున.. డాడీ పేరుతో వైట్ హౌస్ స్పెషల్ వీడియో రూపొందించింది.
White House celebrates Trump’s NATO return with ‘Daddy’s home’ video https://t.co/ufrVgi1Dlq pic.twitter.com/ob3CutKivS
— New York Post (@nypost) June 26, 2025
‘డాడీస్ హోమ్. హే, హే, హే, డాడీ. నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో జరిగిన నాటో సమావేశాలకు అధ్యక్షుడు ట్రంప్ హాజరయ్యారు’ అనే క్యాప్షన్‌తో దీన్ని విడుదల చేసింది. ఈ వీడియోలో నాటో సమావేశాలకు హాజరై తిరిగి అమెరికా వచ్చిన ట్రంప్ యుద్ధవిమానం దిగుతూ కనిపిస్తారు. నాటో సమ్మిట్‌లో సభ్య దేశాధినేతలను కలిసిన.. వాళ్లతో ఆయన మాట్లాడిన దృశ్యాలతో ఉన్న ఈ వీడియో ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.