Shubhanshu Shukla : భారత అంతరిక్ష రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పడింది. కోట్లాది మంది ఆశల్ని మోసుకెళ్లిన వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) గురువారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)లో కాలు మోపాడు. తద్వారా ఈ కేంద్రంలో అడుగిడిన తొలి భారతీయుడిగా శుక్లా చరిత్ర సృష్టించాడు. 41 ఏళ్ల తర్వాత స్పేస్‌కు చేరుకున్న రెండో ఇండియన్‌గానూ అతడు రికార్డు నెలకొల్పాడు. 1984లో సోవియట్ యూనియన్ ఇంటర్ కాస్మోస్ మిషన్‌లో భాగంగా రాకేశ్ శర్మ (Rakesh Sharma) అంతరిక్షానికి వెళ్లిన విషయం తెలిసిందే.
స్పేస్ స్టేషన్ చేరుకున్న వీళ్లకు అక్కడి వ్యోమగాములు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం వెల్కమ్ డ్రింక్ తాగి సంబురాలు చేసుకున్నారు. స్పేస్ స్టేషన్లో మొదటి ఇండియన్‌గా రికార్డుపుస్తకాల్లోకి ఎక్కిన శుభాంశు మాట్లాడుతూ .. ‘మీ ప్రేమ, ఆశీర్వాదంతో నేను అంతరిక్ష కేంద్రం చేరుకున్నాను. భారరహిత స్థితి ఉండే ఇక్కడ నిల్చోవడం సులభమే అనిపిస్తోంది. కానీ, నా తల మాత్రం కొద్దిగా బరువుగా అనిపిస్తోంది. ప్రస్తుతానికైతే అంతా బాగానే ఉంది.
The #Ax4 crew—commander Peggy Whitson, @ISRO astronaut Shubhanshu Shukla, @ESA astronaut Sławosz Uznański-Wiśniewski, and mission specialist Tibor Kapu—emerges from the Dragon spacecraft and gets their first look at their home in low Earth orbit. pic.twitter.com/5q0RfoSv4G
— NASA (@NASA) June 26, 2025
ఇక్కడి వాతావరణానికి అలవాటు పడడంలో ఇది మాకు తొలి దశ. మేము ఇక్కడ ఎన్నో సాంకేతిక అధ్యయనాలు చేయబోతున్నాం. ఈ ప్రయాణాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలనుకుంటున్నా. నాతోపాటు మన మువ్వన్నెల జెండాను తీసుకొచ్చాను. అంతేకాదు మీ అందరిని నాతో పాటే తీసుకొచ్చాను’ అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన యాక్సియం-4 మిషన్ విజయవంతమైంది. భారత కాలమానం ప్రకారం జూన్ 25 బుధవారం మధ్యాహ్నం 12:01కు కెన్నెడీ అంతరిక్ష కేంద్ర నుంచి నాసా నలుగురు వ్యోమగాములను ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌కు పంపింది. శుభాంశు శుక్లాతోపాటు నలుగురు వ్యోమగాములు ఐఎస్ఎస్కు వెళ్లారు.
Axiom Mission 4 aboard the @SpaceX Dragon docked to the station at 6:31am ET today. Soon the Ax-4 astronauts will open the hatch and greet the Exp 73 crew live on @NASA+. More… https://t.co/XmWYPa4BhT pic.twitter.com/LjjMd7DfmW
— International Space Station (@Space_Station) June 26, 2025
భూమికి 418 కిలోమీటర్ల ఎత్తులో.. గంటకు 17 వేల కిలోమీటర్ల వేగంతో.. దాదాపు 28 గంటల పాటూ ప్రయాణించిన డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ గురువారం సాయంత్రం ఐఎస్ఎస్కు చేరుకుంది. శుభాంశు సహ ముగ్గురు వ్యోమగాములు 14 రోజులపాటు అంతరిక్ష కేంద్రంలో గడపనున్నారు. మిషన్ పైలెట్ అయిన శుక్లా నాసా సహకారంతో ఐఎస్ఎస్లో వివిధ శాస్త్రీయ పరిశోధనలు చేయనున్నారు.