న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 345 రాజకీయ పార్టీలు ఆరేళ్లుగా ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. దీంతో ఆ రాజకీయ పార్టీలను జాబితా నుంచి తొలగించేందుకు ఎన్నికల కమిషన్ (ఈసీ) సిద్ధమైంది. (Election Commission) 2019 నుంచి ఆరేళ్లుగా ఒక్క ఎన్నికల్లో అయినా పోటీ చేయాలన్న ముఖ్యమైన షరతును నెరవేర్చడంలో 345 రాజకీయ పార్టీలు విఫలమైనట్లు ఈసీ గురువారం తెలిపింది. ఈ నేపథ్యంలో నమోదైన గుర్తింపు లేని రాజకీయ పార్టీ (ఆర్‌యూపీపీ)లను జాబితా నుంచి తొలగించే ప్రక్రియను ప్రారంభించినట్లు పేర్కొంది.
కాగా, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 2,800కు పైగా నమోదైన గుర్తింపు లేని రాజకీయ పార్టీలు (ఆర్‌యూపీపీ) ఉన్నాయని ఈసీ తెలిపింది. అయితే వీటిలో చాలా వరకు ఆర్యూపీపీగా కొనసాగడానికి అవసరమైన ముఖ్యమైన షరతులను నెరవేర్చడంలో విఫలమైనట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. 345 రాజకీయ పార్టీల కార్యాలయాలు భౌతికంగా ఎక్కడా లేవని ఈసీ వివరించింది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల జాబితా నుంచి వాటిని తొలగించే ప్రక్రియను ప్రారంభించినట్లు వెల్లడించింది.
Also Read:
Watch: ట్రాక్టర్ టైరు కింద ఇద్దరిని తొక్కించిన డ్రైవర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: ఇండిగో విమానంలో లైఫ్ జాకెట్ దొంగిలించిన ప్రయాణికుడు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: మహిళా పోలీస్ అధికారిణి పట్ల.. అసభ్యకరంగా ప్రవర్తించిన బీజేపీ నేత, కేసు నమోదు