Rains | రాయపోల్, జూన్ 26 : ముందస్తు వర్షాలతో రైతులు విత్తనాలు వేయగా.. మొదట్లో మురిపించిన వర్షాలు తర్వాత జాడ లేకుండా పోయారు. దీంతో రైతులు వేసిన పత్తి, మొక్కజొన్న పంటలు మొలకెత్తకపోవడంతో రైతులు దిగాలు చెందారు.
వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేయగా.. సకాలంలో వర్షాలు కురువకపోవడంతో వరుణదేవుడు ఎప్పుడు కరుణిస్తాడోనని రైతులు నిత్యం ఆకాశం వైపు చూశారు. వర్షాలు కురవాలని పలు గ్రామాల్లో మహిళలు బతుకమ్మ ఆటలు, చిన్నారులు కప్పతల్లి ఆటలు ఆడారు. చిన్నారులు, మహిళల ప్రయత్నాలు ఫలించాయి. ఎట్టకేలకు బుధవారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురవడంతో రైతులు సంతోషపడ్డారు.
వేసిన పంటలు మొలకెత్తుండటంతో వానకాలం సాగుపై రైతులకు ఆశలు చిగురించాయి. మండలంలో అధిక శాతం రైతులు పత్తి, మొక్కజొన్న పంటలను సాగు చేస్తారు. కాగా గురువారం రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఎటు చూసినా వ్యవసాయ పనుల్లో రైతులు బిజీబిజీగా ఉన్నారు.
Read Also :
Jagtial | జగిత్యాల జిల్లాలో కొండెక్కిన చింత చిగురు ధరలు.. కిలో ఎంతంటే?
MLC Kavitha | రేవంత్ రెడ్డి అవినీతి చక్రవర్తి.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Stampede | పాఠశాల వద్ద పేలుడు.. తొక్కిసలాటలో 29 మంది చిన్నారులు మృతి