Stampede | సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ (Central African Republic) రాజధాని నగరమైన బంగూయ్ (Bangui)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఉన్నత పాఠశాల ఆవరణలో పేలుడు సంభవించింది. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట (Stampede) కారణంగా పదుల సంఖ్యలో చిన్నారులు ప్రాణాలు (childrens Killed) కోల్పోయారు.
బార్తెలెమీ బోగాండా ఉన్నత పాఠశాల (Barthelemy Boganda High School) ఆవరణలో అధికారులు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేపట్టారు. ఆ సమయంలో అక్కడ ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించినట్లు ఆ దేశ విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. పేలుడు కారణంగా పాఠశాలలో తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు పేర్కొంది. ఈ ఘటనలో 29 మంది విద్యార్థులు మరణించారు. సుమారు 260 మందికిపైగా గాయపడినట్లు అధికారులు గురువారం తెలిపారు. క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
Also Read..
Ayatollah Ali Khamenei | సుప్రీం లీడర్ ఎక్కడ..? ఆందోళనలో ఇరాన్ ప్రజలు
Donald Trump | ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం మళ్లీ రావొచ్చేమో : ట్రంప్
American Airlines | విమానం గాల్లో ఉండగా ఇంజిన్ నుంచి మంటలు, పొగ.. భయాందోళనలో ప్రయాణికులు