American Airlines | విమానం గాల్లో ఉండగా ఇంజిన్ నుంచి మంటలు, పొగ.. భయాందోళనలో ప్రయాణికులు
American Airlines | అమెరికాలో ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన పది నిమిషాల్లోనే విమానం ఇంజిన్ నుంచి మంటలు, పొగలు వచ్చాయి (flames smoke come from engine).
American Airlines | అమెరికాలో ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన పది నిమిషాల్లోనే విమానం ఇంజిన్ నుంచి మంటలు, పొగలు వచ్చాయి (flames smoke come from engine). దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీంతోపెను ప్రమాదం తప్పినట్లైంది.
అమెరికన్ ఎయిర్‌లైన్స్ (American Airlines)కు చెందిన విమానం బుధవారం ఉదయం 8:11 గంటలకు లాస్‌వేగాస్ ఎయిర్‌పోర్టు (Las Vegas Airport) నుంచి నార్త్ కరోలినాకు బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన తర్వాత సమస్య తెలెత్తింది. గాల్లో ఉండగా (midair) ఇంజిన్ నుంచి మంటలు, పొగలు వచ్చాయి. అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించారు. 8:20కి లాస్‌వేగాస్ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 153 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
JUST IN: American Airlines flight forced to return to Las Vegas after an engine apparently caught on fire midair.
American Airlines Flight 1665 was in the air for about 10 minutes after taking off from Harry Reid International Airport in Las Vegas for Charlotte, North Carolina.… pic.twitter.com/lkAeDWkJiw
— Collin Rugg (@CollinRugg) June 25, 2025
Also Read..
Rajnath Singh | చైనాలో ఎస్సీవో రక్షణ మంత్రుల సమావేశం.. హాజరైన రాజ్‌నాథ్ సింగ్
Cloudburst | హిమాచల్‌ప్రదేశ్‌లో కుండపోతగా వర్షాలు.. ఇద్దరు మృతి, పలువురు గల్లంతు
ముట్టుకుంటే 35 ముక్కలుగా నరుకుతా!.. తొలి రాత్రి కత్తితో భర్తను హెచ్చరించిన భార్య
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

