ప్రయాగ్‌రాజ్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ హత్యకేసును మర్చిపోకముందే ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అటువంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. తొలి రాత్రి భార్యను ప్రేమగా దగ్గరకు తీసుకోబోతే ఆమె అతడి ని దారుణంగా బెదిరించింది. తాను మరొకరి సొంతమని, తనపై చెయ్యివేస్తే 35 ముక్కలుగా నరుకుతానని కత్తితో భర్తను బెదిరించింది.
దీంతో అతడికి నోట మాటరాలేదు. అంతేకాదు ప్రియుడితో తాను పారిపోబోతున్నట్టు కూడా చెప్పింది. చెప్పినట్టుగానే మూడోరోజు రాత్రి గోడ దూకి ప్రియుడితో పరారైంది. పోలీసుల కథనం ప్రకారం.. ప్రయాగ్‌రాజ్‌లోని నైనీ ప్రాంతానికి చెందిన కెప్టెన్ నిషాద్కు కర్చానాదేకు చెందిన సితారతో ఇటీవల వివాహమైంది. పెళ్లితంతు సంబరంగానే ముగిసింది.
ఆ తర్వాత తొలి రాత్రి గదిలో భార్య చెప్పిన మాటలతో అతడు వణికిపోయాడు. “నేను మరొకరికి చెందిన వ్యక్తిని. నన్ను ముట్టుకుంటే నిన్ను 35 ముక్కలుగా నరుకుతా’ అని హెచ్చరించింది. నిషాద్ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లాడు. వారు ఆమెను పిలిచి విషయమేంటని ఆరా తీశారు. అప్పుడామె తాను అమన్‌ను ప్రేమిస్తున్నానని స్పష్టంగా చెప్పింది. తాను అతడితోనే జీవించాలనుకుంటున్నానని, ఆ తర్వాత విషయం పెద్దల పంచాయితీకి చేరింది. ఆ తర్వాత ఈ విషయాన్ని రామ్ అసారే పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు, పంచాయితీ జరిగినా.. సితార ఓ రోజు రాత్రి ఇంటి గోడదూకి ప్రియుడితో పరారైంది.