Ramayana Movie | బాలీవుడ్ నుంచి రాబోతున్న మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘రామాయణ’(Ramayana). రూ.4000 కోట్ల బడ్జెట్‌తో రూపోందుతున్న ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్, సౌత్ భామ సాయిపల్లవి లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. కన్నడ స్టార్ యాక్టర్ యశ్ కీ రోల్లో నటిస్తున్నాడు.
దంగల్ ఫేం నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. రెండు పార్టులుగా రాబోతున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడి పాత్రలో నటిస్తుండగా.. సాయి పల్లవి సీత పాత్రను పోషిస్తుంది. యశ్ రావణుడి పాత్రలో నటించబోతున్నాడు. హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, కైకేయి పాత్రలో లారా దత్తా నటిస్తుండగా.. లక్ష్మణుడి పాత్రలో రవి దూబే నటించబోతున్నాడు. కాగా ఇప్పుడు కుంభకర్ణ పాత్రకు సంబంధించిన క్రేజీ వార్త ఒకటి బయటకు వచ్చింది.
తాజా కథనాల ప్రకారం ఈ పాత్రలో పంచాయత్ ఫేం ఫైజల్ మాలిక్ కనిపించబోతున్నాడట. యశ్‌తో కలిసి రామాయణ షూటింగ్లో జాయిన్ కాబోతున్నాడన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూ మూవీ లవర్స్‌లో జోష్ నింపుతోంది. మరి మేకర్స్ రాబోయే రోజుల్లో అధికారిక ప్రకటన జారీ చేస్తారేమో చూడాలి. ఈ చిత్రాన్ని 2026 దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు.
Chinmayi | వైరముత్తుకు జ్ఞానపీఠ్ అవార్డ్.. పవన్ కళ్యాణ్ విష్ చేయడంతో సింగర్ చిన్మయి తీవ్ర విమర్శలు
Akshay Kumar | తండ్రిని కోల్పోయిన బాధని గుర్తుచేసుకున్న అక్షయ్ కుమార్.. పురుషులకు కీలక సూచన