0 Alpha : హోండా కార్స్ ఇండియా తమ తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ జోరో ఆల్ఫా (0 Alpha) నమూనా కారును పరీక్షించనుంది. భారత రోడ్లపై ఈ నమూనా కారును పరుగులు తీయించి.. కీలక విషయాలు తెలుసుకునేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. సోమవారం జీరో ఆల్ఫా పాన్ -ఇండియా రైడ్‌ను జెండా ఊపి ప్రారంభించారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ఈ కారును వచ్చే ఏడాదిలో మార్కెట్లోకి విడుదల చేయనున్నారని సమాచారం.
ప్రముఖ కార్ల కంపెనీ హోండా కార్స్ ఇండియా తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ జీరో ఆల్ఫా పనితీరును పరీక్షించడానికి సిద్ధమైంది. నిరుడు జపాన్ మొబిలిటీ షోలో జీరో ఆల్ఫా నమూనా కారును ప్రదర్శించిన హోండా ఈసారి భారతీయ రోడ్లపై నడిపి.. దాని సామర్ధ్యం, పనితీరు వంటివి బేరీజు వేయనుంది. ఇందులో భాగంగానే రాజస్థాన్‌లోని తపకురా ప్లాంట్‌లో సోమవారం కంపెనీ ప్రతినిధులు జీరో ఆల్ఫా ప్రొటోటైప్ టెస్ట్ రైడ్‌ను ప్రారంభించారు. వైవిధ్యమైన భారతీయ రోడ్లపై ఈ కారును ఉరికిస్తూ.. దారిగుండా ప్రజల అభిప్రాయాలు సేకరించననున్నారు ఇంజనీర్లు.
Honda Cars India has officially begun pan-India road testing for its upcoming electric SUV based on the Honda 0 Series SUV platform. ⚡🚗
The EV will be tested across Indian roads, weather conditions, and charging infrastructure ahead of its global debut planned for FY2026–27.… pic.twitter.com/AAlekoHDcN
— 91Wheels.com (@91wheels) March 16, 2026
తమ కంపెనీ నుంచి వస్తున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూ జీరో ఆల్ఫా కాబట్టి.. దీని ప్రొటోటైప్ తీరును క్షుణ్ణంగా తెలుసుకునే బాధ్యతను కంపెనీ ఇంజనీర్లకు అప్పగించింది హోండా కారు ఇండియా. భారతీయ రోడ్లపై కారు మన్నిక, రోడ్డుపై సౌకర్యంగా ఉందా? లేదా?.. హైవే, సిటీ రోడ్లలో, కొండప్రాంతాల్లో ఈ కారు వేగం, పనితీరు ఎలా ఉంది?.. ఎండ వేడిని, వర్షాలను తట్టుకుంటుందా? వంటి విషయాలను ఇంజనీర్లు నోట్ చేయనున్నారు.

మరీ ముఖ్యంగా.. ఈ నమూనా కారు ఛార్జింగ్ వ్యవస్థను మరీమరీ పరీక్షించనున్నారు. భారతీయ వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని రోజూవారీగా.. పలు ఛార్జింగ్ కేంద్రాల్లో కారు ఛార్జింగ్ చేసి నివేదిక ఇవ్వనున్నారు. ‘భారతీయుల అంచనాలకు జీరో ఆల్ఫా ప్రొటోటైప్ చేరువైందా? లేదా అనేది తెలుసుకునేందుకు ఈ టెస్టింగ్ దశ చాలా కీలక’మని హోండా కార్స్ ఇండియా సీఈవో తకాషీ నకజిమా (Takashi Nakajima) వెల్లడించారు.
జీరో ఆల్ఫా నయూనా కారు డిజైన్ తేలికగా.. తెలివిగా ఉండేలా రూపొందించారు. ముందు భాగంలో హెడ్‌లైట్స్, ఛార్జింగ్ పాయింట్, కాంతులీనే హోండా చిహ్నం.. డిజిటల్ స్క్రీన్ వంటివి అత్యాధునిక సాంకేతికను ప్రతిబింబిస్తాయి. వెనక భాగంలో.. ఎస్యూవీ ఫీచర్లు కనిపిస్తాయి. యూ ఆకారంలోని లైటింగ్, టేల్ ల్యాంప్స్, ఇండికేటర్స్, రివర్స్ లైట్స్.. అన్నీ ఉన్నాయి. 2027లో భారత మార్కెట్లోకి రానున్న ఈ కారు బ్యాటరీ సామర్ధ్యం 60 కేడబ్ల్యూహెచ్ లేదా 70 కేడబ్ల్యూహెచ్ ఉండనుంది. మరిన్ని వివరాలు త్వరలోనే కంపెనీ వెల్లడించే అవకాశముంది.