Donald Trump | ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం (Israel-Iran War) ముగిసిన విషయం తెలిసిందే. రెండు దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంతో గత 12 రోజులుగా సాగిన యుద్ధం ముగిసింది. దీంతో పశ్చిమాసియాలో కూడా ఉద్రిక్తతలు కాస్త చల్లారాయి. ఇప్పుడిప్పుడే అన్ని కార్యకలాపాలూ మొదలయ్యాయి. ఇంతలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం మళ్లీ రావొచ్చేమో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఆ రెండు దేశాలతో నేను మాట్లాడి ఉద్రిక్తతలను పరిష్కరించాను. ప్రస్తుతం ఆ రెండు దేశాలూ అలసిపోయాయి. అవి మళ్లీ యుద్ధాన్ని ప్రారంభిస్తాయా..? అంటే ఏదో ఒకరోజు అది సాధ్యమేనని నేను అనుకుంటున్నా. ఇది త్వరలోనే ప్రారంభం కావొచ్చు కూడా’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య గడిచిన 12 రోజులుగా కొనసాగిన యుద్ధానికి కాల్పుల విరమణ ఒప్పందంతో తెరపడింది. ఇరు దేశాల మధ్య సయోధ్య కోసం ఇజ్రాయెల్‌తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంప్రదింపులు జరిపినప్పటికీ ఇరాన్‌తో కుదరలేదు. దీంతో ట్రంప్ కోరిక మేరకు రంగంలోకి దిగిన ఖతార్.. ఇరాన్‌ను ఒప్పించింది. మొత్తంగా ఖతార్ మధ్యవర్తిత్వం కారణంగానే ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధానికి తెరపడిందని చెప్పొచ్చు. దీంతో 30 లక్షల జనాభా కూడా లేని ఈ పశ్చిమాసియా దేశంపై అందరి దృష్టి పడింది.
Also Read..
Donald Trump | భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని ఆపింది నేను.. మళ్లీ పాతపాటే పాడిన ట్రంప్
American Airlines | విమానం గాల్లో ఉండగా ఇంజిన్ నుంచి మంటలు, పొగ.. భయాందోళనలో ప్రయాణికులు