Jawahar Navodaya Vidyalaya | మెదక్ మున్సిపాలిటీ, జూన్ 26 : వర్గల్‌లోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశాలకు 13 డిసెంబర్ 2025 నాడు ఎంపిక పరీక్ష నిర్వహించబడుతుందని జిల్లా విద్యాశాఖాధికారి రాధాకిషన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రస్తుత విద్యాసంవత్సరంలో 5వ తరగతి చదువుతూ మే 1, 2014 నుండి జూలై 31, 2016 మధ్య జన్మించిన విద్యార్హులు ఎంపిక పరీక్షకు అర్హులు అన్నారు. విద్యార్థులు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 3, 4వ తరగతులు చదివి ఉండాలన్నారు.
ఆసక్తి కలిగిన విద్యార్థులు జూలై 29వ తేదీలోగా ఆన్లైన్లో www.navodaya.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మండల విద్యాధికారులు తమ పరిధిలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేసి ఎక్కువ మంది విద్యార్థులు పరీక్ష రాసేలా ప్రోత్సహించాలన్నారు. మిగతా వివరాలకు హెల్ప్ లైన్ నంబర్లు 7382335164, 9448901318 నంబర్లను సంప్రదించాలన్నారు.
Read Also :
Jagtial | జగిత్యాల జిల్లాలో కొండెక్కిన చింత చిగురు ధరలు.. కిలో ఎంతంటే?
MLC Kavitha | రేవంత్ రెడ్డి అవినీతి చక్రవర్తి.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Stampede | పాఠశాల వద్ద పేలుడు.. తొక్కిసలాటలో 29 మంది చిన్నారులు మృతి