WTC Celebration : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో గెలుపొందిన దక్షిణాఫ్రికా (South Africa) జగజ్జేతగా అవరించింది. ఇన్నాళ్లుగా మౌనంగా భరిస్తున్న ‘చోకర్స్’ అనే ముద్రను చెరిపేస్తూ ఐసీసీ ఛాంపియన్‌గా నిలిచింది సఫారీ టీమ్. లార్డ్స్ మైదానంలో చిరస్మరణీయ విజయం అనంతరం దక్షిణాఫ్రికా ఆటగాళ్లు పట్టలేనంత సంబురంలో మునిగిపోయారు. క్రికెట్ చరిత్రలో తమపేరు చిరస్థాయిలో నిలిచిపోయిందనే సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఇక తనదైన కెప్టెన్సీ మంత్రతో తమ జట్టు 27 కలను సాకారం చేసిన తెంబ బవుమా (Temba Bavuma) అయితే ఓ రేంజ్లో విక్టరీ సెలబ్రేషన్ చేసుకున్నాడు.
లార్డ్స్ మైదానంలో తొలి రెండు రోజులు ఆధిపత్యం చెలాయించిన ఆస్ట్రేలియాకు చెక్ పెడుతూ విజేతగా నిలిచింది దక్షిణాఫ్రికా. కగిసో రబడ 9 వికెట్లతో మ్యాచ్‌ను మలుపు తిప్పగా.. ఎడెన్ మర్క్రమ్(136) వీరోచిత సెంచరీతో చెలరేగాడు. 66 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన బవుమా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కంగారూలపై 5 వికెట్లతో గెలుపొందిన అనంతరం అదే మైదాన బహుమతి ప్రదానం జరిగింది.
ఐసీసీ ఛైర్మన్ జై షా (Jai Shah) నుంచి టెస్టు గదను స్వీకరించిన బవుమా.. సహచరులు, అభిమానుల జయజయధ్వానాల మధ్య గదను రెండు చేతులతో పైకి ఎత్తాడు. అనంతరం గదను కుడి భుజ మీద పెట్టుకొని గన్ను పేలుస్తున్నట్టుగా తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరలవుతోంది.
There were doubts, criticism, racism & what not but Bavuma stood in quiet defiance against all the odds, let his bat do the talk & led his team from the front.
He carried nation’s hopes on his shoulders and fittingly so because Temba literally means HOPE. 🫡 #SAvAUS https://t.co/Y3uF5dRUzk
— Maryam (@Maryammr285) June 14, 2025
ఆసీస్ నిర్దేశించిన 282 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా గెలుపు బాధ్యతను భుజాలకు ఎత్తుకున్నారు మర్క్రమ్, బవుమా. వరల్డ్ క్లాస్ పేస్ దళం బుల్లెట్ లాంటి బంతులు సంధిస్తున్నా అదరక బెదరక క్రీజులో పాతకుపోయిన ఇద్దరు సఫారీలను గెలుపు వాకిట నిలిపారు. లార్డ్స్‌లో రికార్డు భాగస్వామ్యం(147 పరుగులు)తో భారత దిగ్గజాలు అజిత్ అగార్కర్, వీవీఎస్ లక్ష్మణ్‌లను నాలుగో స్థానానికి నెట్టేసిందీ ద్వయం.
లార్డ్స్‌లో చిరస్మరణీయ సెంచరీతో తమ జట్టు 27 ఏళ్ల కలను సాకారం చేసిన మర్క్రమ్.. విజయోత్సవంలో భాగంగా ఒక అభిమాని ఇచ్చిన బీరు తాగాడు. అయితే.. సదరు ఫ్యాన్ మర్క్రమ్కు ఏం అవుతాడా? అని మీడియా, ఆన్లైన్ చర్చ మొదలైంది. దాంతో.. తనకు బీరు ఆఫర్ చేసిన వ్యక్తి మరెవరో కాదని.. తన స్కూల్ ఫ్రెండ్ అని చెప్పేశాడీ మ్యాచ్ విన్నర్.