నెక్కొండ, జూన్ 15 (నమస్తే తెలంగాణ): నెక్కొండ మండలంలో సీఈఐఆర్(CEIR )పోర్టల్ ద్వారా ట్రేస్ చేసిన సుమారు రూ. లక్ష విలువైన ఐదు మొబైల్ ఫోన్లను సంబంధిత బాధితులకు నెక్కొండ పోలీసులు అందించారు. వివరాల్లోకి వెళ్తే..నెక్కొండ గ్రామానికి చెందిన ఈదునూరి దిలీప్, రాపాక కట్టయ్య, గేటుపల్లి గ్రామానికి చెందిన మూడు విజయపాల్, రెడ్లవాడకు చెందిన మేడిరాజు ,రావు, వినయ్ అనే వారికి మొబైల్ ఫోన్లు తిరిగి అందించారు.
మొబైల్ ఫోన్లు పోగొట్టుకన్నవారికి ఈ ప్రక్రియ ద్వారా ఉపశమనం లభించిందని నెక్కొండ ఎస్ఐ మహేందర్ తెలిపారు. మొబైల్ పోయిన పక్షంలో CEIR పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయడం వల్ల ఫోన్లు ట్రేస్ చేసి తిరిగి పొందడం సులభమవుతుందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.