Maganti Gopinath | ఎర్రగడ్డ, జూన్ 15 : అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సంస్మరణ సభను ఎర్రగడ్డ డివిజన్ రాజీవ్ నగర్లో ఆదివారం నిర్వహించారు. స్థానిక కమ్యూనిటీ హల్లో జరిగిన ఈ సభలో మాగంటి చిత్ర పటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాలనీ అభివృద్ధికి ఎమ్మెల్యే మాగంటి ఎంతో సహకరించారని వారంతా గుర్తు చేసుకున్నారు. అదే విధంగా ఆయన చేసిన మంచి పనులు నియోజకవర్గ ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరని పేర్కొన్నారు. సభకు రాజీవ్ నగర్ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు కృష్ణ శర్మ అధ్యక్షత వహించారు. డాక్టర్ ఎస్వీ ప్రసాద్, కాలనీ అధ్యక్షుడు వినయసాగర్, పీఏఎస్ మూర్తి, ఎస్.రాంబాబు, భద్రుద్దీన్, ముసలినాయుడు, ఎంవీ సత్యనారాయణ, చంద్రశేఖర్ రెడ్డి, మోహనరావు, భుజంగరావు, నసీర్, చంద్రశేఖర్, విజయానంద్, జగదీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.