Strange Rumour : మగ పిల్లలు పార్లేజీ బిస్కెట్ తినకపోతే ఏదో అవుతుందని వింత ప్రచారం.. బిస్కెట్ల కోసం క్యూ కట్టిన జనం
మగ పిల్లలు పార్లేజీ బిస్కెట్ తినకపోతే ఏదో అవుతుందని వింత ప్రచారం | ఒక్కో చోట ఒక్కో సంప్రదాయం ఉంటుంది. కొన్ని ఆచారాలు ఖచ్చితంగా పాటించాల్సిందే. కొన్ని తాతల కాలం నాటి నుంచి ఆచరిస్తూ వస్తుంటారు. వాటిని అలాగే ఆచరిస్తూ ఉంటారు జనం. అయితే.. తాజాగా బీహార్ లో ఓ వింత ప్రచారం జరిగింది.
ఒక్కో చోట ఒక్కో సంప్రదాయం ఉంటుంది. కొన్ని ఆచారాలు ఖచ్చితంగా పాటించాల్సిందే. కొన్ని తాతల కాలం నాటి నుంచి ఆచరిస్తూ వస్తుంటారు. వాటిని అలాగే ఆచరిస్తూ ఉంటారు జనం. అయితే.. తాజాగా బీహార్ లో ఓ వింత ప్రచారం జరిగింది. అది ఏంటంటే.. ఇంట్లో ఉండే మగ పిల్లలు పార్లే జీ బిస్కెట్ తినాలని.. వాళ్లు పండుగగా భావించే పండుగ రోజు జితియా రోజున మగ పిల్లలు ఆ బిస్కెట్ తినకపోతే.. భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయి.. అనే ప్రచారం అక్కడ స్టార్ట్ అయింది.

జితియా ఫెస్టివల్ అనేది.. తమ కొడుకులు పది కాలాల పాటు ఆరోగ్యంగా, సిరిసంపదలతో వర్థిల్లాలని తల్లులు చేసే పండుగ అది. ఆ పండుగ రోజున 24 గంటల పాటు తల్లులు ఉపవాసం ఉంటారు. ఈ పండుగ మూడు రోజుల పాటు ఉంటుంది. ఈ పండుగను బీహార్ లోని మైథిలి, మగధి, భోజ్ పూరి మాట్లాడే రీజియన్లతో పాటు జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ లోనూ జరుపుకుంటారు.
ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టే ఈ సంవత్సరం కూడా జరుపుకోవడం కోసం ప్రజలు అన్నీ రెడీ చేసుకుంటున్న సందర్భంలోనే.. మగ పిల్లలు ఖచ్చితంగా ఆ పండుగ రోజున పార్లే జీ బిస్కెట్ తినాలని లేకపోతే.. భవిష్యత్తులో వాళ్లకు చాలా సమస్యలు వస్తాయనే పుకారు షికారు చేసింది.
దీంతో.. కొడుకులు ఉన్న తల్లిదండ్రులు షాపుల ముందు క్యూ కట్టారు. బీహార్ లోని సీతామర్హి జిల్లాలో ఈ ప్రచారం ఎక్కువగా జరగడంతో ఆ జిల్లాలో ఏ కిరాణ షాపులో చూసినా జనాలు ఎగబడ్డారు. దీంతో షాపుల యజమానులు.. 5 రూపాయల పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్ ను 50 రూపాయలకు, 100 రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. తర్వాత ఈ రూమర్.. రాష్ట్రం మొత్తం వ్యాపించడంతో పార్లె జీ బిస్కెట్ ప్యాకెట్ అమ్మకాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వాటి ధరలకు రెక్కలు రావడంతో పాటు.. ఒక్క బిస్కెట్ దొరికినా చాలు అని షాపుల ముందు జనాలు మాత్రం ఎగబడ్డారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Shocking Video : బాలిక ఒడిలో నిద్రపోతున్న పైథాన్
Photo of the Day : సీతాకోకచిలుకలతో గొరిల్లా ఆట.. ఈ ఫోటో చూస్తే వావ్ అనాల్సిందే
వైరల్ పిక్స్ : రైస్ కుక్కర్ను పెండ్లి చేసుకున్నాడు!
Hangover | గుడ్డు తింటే హ్యాంగోవర్ తగ్గిపోతుందా?
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

