Hangover | పార్టీలు, ఫంక్షన్లలో మందు అనేది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది ! ఫంక్షన్ చిన్నదైనా.. పెద్దదైనా.. మామూలుగా నలుగురు ఫ్రెండ్స్ కలిసినా మందు పార్టీలు అవుతూనే ఉంటాయి ! ఏ కారణంతో తాగితే ఏముంది ! లిమిట్ మంచినంత వరకు బాగానే ఉంటుంది ! అదే పరిమితి మించి తాగితే రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీర్ఘకాలికంగా వచ్చే అనారోగ్య సమస్యలే కాదు.. వెంటనే వచ్చే దుష్ప్రభవాలు కూడా ఉంటాయి. వాటిల్లో ఒకటే హ్యాంగోవర్. అతిగా మద్యం సేవించినప్పుడు మైకంతో పాటు దాహం, అలసట, వికారం వంటి సమస్యలు వస్తుంటాయి కదా ! ఇవన్నీ హ్యాంగోవర్ లక్షణాలే. మరి అసలు హ్యాంగోవర్ ఎందుకు వస్తుంది? దీని నుంచి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలి? ఒకసారి తెలుసుకుందాం..
ఆల్కహాల్ మితంగా తీసుకున్నప్పుడు శరీరంలో డొపమైన్, ఎండార్పిన్ వంటి హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి మెదడును తాత్కాలికంగా ఉత్తేజపరుస్తాయి. కానీ అదే ఆల్కహాల్‌ను మోతాదుకు మంచి తీసుకుంటే మెదడు క్రియాశీలత తగ్గిపోతుంది. నాడులు దెబ్బతింటాయి. హారోన్ల బ్యాలెన్స్ తప్పుతుంది. ముఖ్యంగా ఆల్కహాల్ శరీరంలో పీయూష గ్రంథిని నిలువరించి, వాసోప్రెసిన్ హార్మోన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. ఈ హార్మోన్ మూత్ర ఉత్పత్తిని నియంత్రిస్తుంది. అందుకే మద్యం తాగినప్పుడు మూత్ర విసర్జన ఎక్కువగా చేస్తుంటారు. దీనివల్ల శరీరంలో నుంచి ఎక్కువ నీరు బయటకు వెళ్లిపోతుంది. తద్వారా డీహైడ్రేషన్ అవుతుంది. రక్తంలో నీటిస్థాయిలు తగ్గడం వల్ల తలనొప్పి వస్తుంది. తల బరువెక్కుతుంది. సాధారణంగా చాలామంది లేట్ నైట్ వరకు డ్రింక్ చేస్తుంటారు. వీటన్నింటి ఎఫెక్ట్ నిద్ర మీద కూడా ఉంటుంది. నిద్ర లేకపోవడం వల్ల తొందరగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. ఈ లక్షణాలు అన్నింటినే మనం హ్యాంగోవర్ అని చెప్పుకుంటున్నాం. ఈ హ్యాంగోవర్‌ను తగ్గించేందుకు ప్రస్తుతానికి ఎలాంటి మందులు లేవు. కాకపోతే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల హ్యాంగోవర్ నుంచి త్వరగా బయటపడొచ్చు.
హ్యాంగోవర్లో ఉన్నప్పుడు చిన్న శబ్దం కూడా చాలా పెద్దదిగా వినిపిస్తుంది. ఎక్కువ వెలుతురులో ఉండలేరు. దీని నుంచి బయటపడేందుకు చాలా మంది కషాయం లాంటివి తాగుతుంటారు. లేదా చంకలో నిమ్మకాయ రుద్దుకుని హ్యాంగోవర్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇవి కాకుండా హ్యాంగోవర్ తగ్గించుకునేందుకు మరిన్ని సులభమైన మార్గాలున్నాయంటున్నారు నిపుణులు.
ఆరోగ్యకరమైన అల్పాహారం తినడం వల్ల హ్యాంగోవర్‌ను తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల రక్తంలోని షుగర్ లెవల్స్ నియంత్రణకు వచ్చి వికారం, అలసట, బలహీనత వంటివి తగ్గుతాయి. కాబట్టి అతిగా మద్యం సేవించినప్పుడు.. విటమిన్లు, మినరల్స్ ఉన్న ఆహారం తీసుకుంటే హ్యాంగోవర్ నుంచి తప్పించుకోవచ్చు. కొంతమంది అయితే హ్యాంగోవర్ తగ్గాలంటే గుడ్డు తినమని చెబుతుంటారు. గుడ్డులో ఉండే సిస్టీన్ అనే అమైనో ఆమ్లాలు.. ఎసిటాల్డిహైడ్‌ను వేరుచేయడానికి సాయం చేస్తాయి. కాబట్టి హ్యాంగోవర్ నుంచి కాస్త ఉపశమనం లభించవచ్చు.
చాలావరకు డ్రింక్ పార్టీలు రాత్రి సమయాల్లోనే జరుగుతుంటాయి. రాత్రి పూట ఎక్కువసేపు తాగడం వల్ల నిద్రభంగం కలుగుతుంది. తద్వారా తొందరగా అలసిపోతారు. అందుకే డ్రింక్ చేసినప్పుడు విశ్రాంతి చాలా అవసరం. అలా కాకుండా అలసటతోనే ఇతరత్రా పనులు చేస్తే హ్యాంగోవర్ మరింత పెరుగుతుంది. కాబట్టి హ్యాంగోవర్ నుంచి తొందరగా బయటపడాలంటే ఎక్కువసేపు నిద్రపోవడం చాలా ముఖ్యం.
ఆల్కహాల్ శరీరంలో పీయూష గ్రంథిని నిలువరించి, వాసోప్రెసిన్ హార్మోన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. ఈ హార్మోన్ మూత్ర ఉత్పత్తిని నియంత్రిస్తుంది. అందుకే మద్యం తాగినప్పుడు మూత్ర విసర్జన ఎక్కువగా చేస్తుంటారు. అలాగే అతిగా మద్యం సేవించినప్పుడు కొంతమంది వాంతులు చేసుకుంటుంటారు. దీనివల్ల మీరు తాగే నీళ్ల కంటే కూడా ఎక్కువ నీరు శరీరం నుంచి బయటకు వెళ్లిపోతుంది. అది డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. కాబట్టి డ్రింక్ చేసినప్పుడు ఎక్కువగా నీళ్లు తాగాలి. అలసట నుంచి తప్పించుకునేందుకు పండ్ల రసాలు తీసుకోవాలి.
పురాణం, వృత్తాంత ఆధారాల ప్రకారం.. డ్రింక్ చేసిన తర్వాత రోజు ఉదయం పానీయం(కషాయం) తీసుకోవడం వల్ల హ్యాంగోవర్ లక్షణాలను తగ్గిస్తుందట. ఎందుకంటే ఆల్కహాల్ పానీయాలను నివారించే మిథనాల్ అనే రసాయనం కషాయంలో ఉంటుంది. వీటితో పాటు మత్తు పూర్తిగా దిగేవరకు మందు తాగకుండా విరామం ఇవ్వడం బెటర్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
బైపాస్ సర్జరీ తర్వాత ఎన్ని రోజులకు శృంగారంలో పాల్గొనవచ్చు ?
ఆయనకు ఆ కోరిక ఎక్కువ.. నేనేం చేయాలి?
ఈ మధ్యే పెండ్లయింది.. నా అనుమానం నిజమేనా
ఆరు నెలలుగా మా ఆవిడ ముట్టుకోనివ్వడం లేదు.. ఏం చేయమంటారు?
శృంగార సామర్థ్యం పెరగాలంటే ఇలా చేయండి..
బయటకు వచ్చేస్తున్నది..ఏం చేయమంటారు?