World’s Shortest Cow : మరుగుజ్జు ఆవు.. ప్రపంచంలోనే అత్యంత పొట్టి ఆవు.. దాని హైట్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు
మరుగుజ్జు ఆవు.. ప్రపంచంలోనే అత్యంత పొట్టి ఆవు | ప్రపంచంలోనే అత్యంత పొట్టిగా ఉండే మనుషులను చూశాం, అత్యంత పొట్టిగా ఉండే చెట్లను చూశాం కానీ.. అత్యంత
ప్రపంచంలోనే అత్యంత పొట్టిగా ఉండే మనుషులను చూశాం, అత్యంత పొట్టిగా ఉండే చెట్లను చూశాం కానీ.. అత్యంత పొట్టిగా ఉండే ఆవును ఇప్పటి వరకు చూడలేదు అంటారా? పైన ఫోటోలో ఉన్న ఆవు పేరు రాణి. దాని హైట్ ఎంతో తెలుసా? కేవలం 20 ఇంచులు.. అంటే 50.8 సెంటీమీటర్లు అన్నమాట. దీనికి మరుగుజ్జు ఆవు అనే పేరు వచ్చింది.

బంగ్లాదేశ్ కు చెందిన కాజి మహమ్మద్ అబు సుఫియాన్ కు చెందినదే ఈ మరుగుజ్జు ఆవు. ఈ ఆవు పుట్టడమే మరుగుజ్జుగా పుట్టడంతో.. దీన్ని చూడటానికి అక్కడి స్థానికులు.. ఫామ్ కు తరలివెళ్లేవారు. దీంతో.. తన ఆవు పేరును గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో ఎక్కించేందుకు ఆవు ఓనర్ కాజి మహమ్మద్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సంస్థకు దరఖాస్తు చేశాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు.. రాణి పేరును గిన్నిస్ బుక్ లో ఎక్కించడానికి ముందే ఆ ఆవు.. ఆగస్టు 19న మరణించింది.
తాజాగా.. ఆ ఆవును ప్రపంచంలోనే అత్యంత పొట్టి ఆవుగా గుర్తించినట్టు.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు.. కాజి మహమ్మద్ కు మెయిల్ చేశారు. కానీ.. రాణి మాత్రం బతికిలేదు. ఇదివరకు గిన్నిస్ రికార్డు నమోదు అయి ఉన్న ఇండియాకు చెందిన ఆవు మాణిక్యం మీద ఉన్న రికార్డును రాణి బద్దలు కొట్టింది. మాణిక్యం అనే ఆవు ఎత్తు 61 సెంటీమీటర్లు కాగా.. రాణి ఎత్తు కేవలం 50.8 సెంటీమీటర్లే.
గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులకు రాణి చనిపోయిన విషయం తెలియదు. రాణి వీడియోలతో పాటు దాని పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ ను కూడా పంపించాం. దాని మరణంలో ఎటువంటి అసాధారణ స్థితి లేనందు వల్ల.. రాణి పేరునే గిన్నిస్ వరల్డ్ రికార్డులో పొందుపరిచారు. ఒకరకంగా ఇది మాకు సంతోషకరమైన వార్తే అయినప్పటికీ.. రాణి మా మధ్య లేకపోవడం మాత్రం మమ్మల్ని ఇప్పటికీ బాధిస్తోంది.. అని కాజీ మహమ్మద్ బోరుమన్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
వైరల్ పిక్స్ : రైస్ కుక్కర్‌ను పెండ్లి చేసుకున్నాడు!
Hangover | గుడ్డు తింటే హ్యాంగోవర్ తగ్గిపోతుందా?
అమరత్వం సాధ్యమే : మనిషి జీవనకాలానికి పరిమితి లేదంటున్న పరిశోధకులు!
33 ఏండ్లు మారుమూల దీవిలో ఏకాంతవాసం.. ఇప్పుడు నగరంలో కొత్త జీవితం..!
ఈ చిలుక సిన్నది కాదు.. చిన్న పిల్లలతో దోస్తీ చేస్తుంది..!
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

