ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, మంత్రులు, ఇతర నేతలు.. ఏదైనా ఓపెనింగ్‌కు వెళ్లినప్పుడు ఖచ్చితంగా అక్కడ రిబ్బన్ కటింగ్ ఉంటుంది. ఆ ఈవెంట్‌కు వచ్చిన ముఖ్య అతిథితో రిబ్బన్ కట్ చేయించడం అలవాటుగా మారింది.
ఇలాగే.. ఓ ఈవెంట్లో రిబ్బన్ కటింగ్ కోసం వెళ్లిన ఓ మంత్రి ఏకంగా రిబ్బన్‌ను తన పళ్లతో కొరికి మరీ కట్ చేశాడు. ఈ ఘటన పాకిస్థాన్‌లో చోటు చేసుకుంది. పాకిస్థాన్ మంత్రి ఫయాజ్ ఉల్ హాసన్.. రావల్పిండిలో ఓ ఈవెంట్‌కు హాజరయ్యాడు. ఎలక్ట్రానిక్ షాప్ ఓపెనింగ్‌కు ఆయన్ను ముఖ్య అతిథిగా పిలిచారు. అయితే.. రిబ్బన్ కట్ చేసేందుకు.. ఆయనకు కత్తెర ఇచ్చినా కూడా.. అది తుప్పు పట్టిపోవడంతో ఆ రిబ్బన్ అస్సలు కట్ కాలేదు. దీంతో చేసేందేం లేక.. తన పళ్లతో ఆ రిబ్బన్‌ను కట్ చేశాడు. తన పళ్లతో చేసిన రిబ్బన్ కట్ వీడియోను ఫయాజ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
اپنے حلقے میں دوکان کے افتتاح کا انوکھا انداز۔۔۔!!! قینچی کند اور خراب تھی۔۔!!! مالک دوکان کو شرمندگی سے بچانے کے لیے نیا عالمی ریکارڈ قائم کر دیا۔۔!!!@UsmanAKBuzdar pic.twitter.com/MRxedX0ZaB
— Fayaz ul Hassan Chohan (@Fayazchohanpti) September 2, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Sea Snake : వామ్మో.. సముద్రంలో పాములు ఇలా ఉంటాయా? వైరల్ వీడియో
నెట్టింట్లో మిల్క్ క్రేట్ చాలెంజ్!
Viral Video : ద్యావుడా.. పుచ్చకాయలను ఇలాంటి పనులకు కూడా వాడుతారా?
Krishna Janmashtami 2021 : ఈ చిన్నారి క్యూట్ డ్యాన్స్‌కు ఫిదా కావాల్సిందే.. వైరల్ వీడియో
World’s Highest Movie Theatre : ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో సినిమా థియేటర్.. ఇండియాలో ప్రారంభం