జూగాడ్ అంటే తెలుసా మీకు. ఎవ్వరికీ రాని ఆలోచన వస్తే.. దాన్ని ఆచరణలో పెడితే.. అది అందరికీ నచ్చితే దాన్ని జూగాడ్ అంటారు. అయితే.. టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదనే విషయం అందరికీ తెలుసు. అందుకే.. చదువుకున్నా.. చదువుకోకపోయినా.. ఆస్తులు ఉన్నా లేకపోయినా.. మెదడుకు కాస్త పదును పెడితే చాలు.. ఏదో ఒక ఐడియా తడుతుంది.
అలా.. చాలామంది తమకు వచ్చిన ఐడియాలతో అద్భుతాలు సృష్టించారు. టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. కొందరు ఓవర్ నైట్ సెలబ్రిటీలు కూడా అయ్యారు.
తాజాగా.. ఓ వ్యక్తికి వచ్చిన ఆలోచనను చూసి నెటిజన్లు అబ్బురపడుతున్నారు. వాట్ ఆన్ ఐడియా సర్జీ.. అంటూ నెటిజన్లు అతడిని ఆకాశానికెత్తుతున్నారు.
రోడ్డు మీద వరద నీరు పొంగి పొర్లుతుండటంతో ఆ వరద నీటిలో నడవడం కోసం రెండు ప్లాస్టిక్ కుర్చీలకు చెప్పులను కట్టి.. ఆ ప్లాస్టిక్ కుర్చీలతో కాళ్లు కూడా తడవకుండా ఓ వ్యక్తి వరద నీటిలో హాయిగా నడుచుకుంటూ వెళ్లాడు. దానికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
నడవడం ఇష్టం లేక అంబులెన్స్‌కు ఫోన్.. 39 సార్లు ఫ్రీ ట్యాక్సీలా వాడుకున్నాడు
నచ్చిన ఫుడ్ తినడం కోసం 8000 రెస్టారెంట్లు తిరిగాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Magizhini : అదరగొడుతున్న లెస్బియన్ సాంగ్.. తమిళంలో రిలీజ్ అయిన ఫస్ట్ వీడియో వైరల్
Belly Dance : ‘మనికె మగె హితే’ పాటకు బెల్లీ డ్యాన్స్ చేసి అదరగొట్టేసింది.. వీడియో వైరల్