కొరియన్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ తెలుసు కదా. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఆ సిరిస్‌కు వచ్చిన రెస్పాన్స్ మరే సిరీస్‌కు రాలేదు. నెట్‌ఫ్లిక్స్‌లో ఇప్పటి వరకు దేనికీ రాని వ్యూస్ స్క్విడ్ గేమ్‌కు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా స్క్విడ్ గేమ్‌ను ఆదరించారు. ఈ ఏడాది సూపర్ డూపర్ హిట్ అయిన.. సిరీస్‌లలో స్క్విడ్ గేమ్ ముందుంటుంది.
ఆ సిరీస్ అంతా ఒక గేమ్ నడుస్తుంది. బాగా డబ్బు అవసరం ఉన్నవాళ్లను ఓ ఐలాండ్‌కు తీసుకెళ్లి అక్కడ అందరితో కలిపి గేమ్స్ ఆడిపిస్తాడు. రౌండ్ ముగుస్తున్న కొద్దీ ఓడిపోయిన వాళ్లను కాల్చి చంపేస్తుంటారు. చివరకు ఒక్కడే మిగులుతాడు. అతడికే ప్రైజ్ మనీ మొత్తం చెందుతుంది. అయితే.. గేమ్‌లో ఓడిపోయిన వాళ్లను చంపడమే ఆ సిరీస్‌లో అసలు ట్విస్ట్.
అయితే.. అదే కాన్సెప్ట్‌తో రియల్ లైఫ్ స్క్విడ్ గేమ్‌ను సృష్టించాడు ఓ యూట్యూబర్. మిస్టర్ బీస్ట్ అనే పేరుతో ఉన్న యూట్యూబ్ చానెల్లో వీడయో కోసం రియల్ లైఫ్ స్క్విడ్ గేమ్‌ను సృష్టించాడు. దీని కోసం అతడు బాగానే కర్చు చేశాడు. మొత్తం 26 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి మరీ.. స్క్విడ్ గేమ్ కాన్సెప్ట్‌ను రూపొందించాడు.
ఈ గేమ్‌లో గెలిచిన వ్యక్తికి రూ.3.4 కోట్ల ప్రైజ్ మనీ, రన్నర్ అప్‌కి ఒక ప్రైజ్ మనీ.. మధ్యలో డ్రాప్ అయిన వాళ్లకు కొంత అమౌంట్ ఇచ్చి పంపించాడు. అయితే.. ఈ గేమ్‌లో ఓడిపోయిన వాళ్లను కాల్చి చంపేలేదు కానీ.. డమ్మీ గన్‌తో చంపినట్టు చేసి వాళ్లను ఇంటికి పంపించేశాడు.
స్క్విడ్ గేమ్ సిరీస్‌లో ఉన్న గేమ్స్ లాగానే.. ఇందులో కూడా రెడ్ లైట్.. గ్రీన్ లైట్‌తో గేమ్‌ను స్టార్ట్ చేశాడు. అలా మొత్తం రౌండ్స్ అన్నీ పూర్తయ్యాక.. చివరకు 79వ పార్టిసిపెంట్ ఈ యూట్యూబ్ స్క్విడ్ గేమ్ కాంపిటిషన్లో విజయం సాధించారు. దీంతో ఆ వ్యక్తికి రూ.3.4 కోట్ల ప్రైజ్ మనీని అందించారు. కంటెస్టెంట్ నెంబర్ 330.. రూ.7.7 లక్షల క్యాష్ ప్రైజ్‌ను గెలుచుకున్నారు.
రియల్ లైఫ్ స్క్విడ్ గేమ్ మొత్తాన్ని షూట్ చేసి.. మిస్టర్ బీస్ట్ యూట్యూబ్ చానెల్లో పోస్ట్ చేయగా.. ఆ వీడియోను 7 కోట్ల మంది వీక్షించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
నచ్చిన ఫుడ్ తినడం కోసం 8000 రెస్టారెంట్లు తిరిగాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Magizhini : అదరగొడుతున్న లెస్బియన్ సాంగ్.. తమిళంలో రిలీజ్ అయిన ఫస్ట్ వీడియో వైరల్
Belly Dance : ‘మనికె మగె హితే’ పాటకు బెల్లీ డ్యాన్స్ చేసి అదరగొట్టేసింది.. వీడియో వైరల్
అక్కడ వారానికి నాలుగు రోజులే పని.. జీతం కూడా కట్ చేయరు
ఫోన్లకు చార్జింగ్ పెట్టుకుంటే జీతం కట్.. ఉద్యోగులకు బాస్ అల్టిమేటం