ఒక్కొక్కరికి ఒక్కో పాషన్ ఉంటుంది. కొందరికి ట్రావెల్ అంటే ఇష్టం. మరికొందరికి షాపింగ్ అంటే ఇష్టం..ఇలా ఎవరి అభిరుచులు వాళ్లకు ఉంటాయి. అలాగే ఓ వ్యక్తి తనకు నచ్చిన ఫుడ్ తినడం కోసం ఏకంగా 8000 రెస్టారెంట్లు తిరిగాడు. తనకు ఎక్కడా నచ్చిన ఫుడ్ దొరకలేదు. దీంతో ఎక్కడ రెస్టారెంట్ కనిపిస్తే అక్కడి వెళ్లడం.. చివరకు వేరే ప్రాంతాలకు వెళ్లి అక్కడ కూడా తనకు నచ్చిన ఆహారం దొరుకుతుందేమోనని రెస్టారెంట్లను జల్లడ పట్టాడు ఈయన.
చైనాకు చెందిన 72 ఏళ్ల డేవిడ్ ఆర్ చాన్ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకునేది. తనది చైనా అయినప్పటికీ.. తనకు చిన్న వయసు ఉన్నప్పుడే అమెరికాలో స్థిరపడ్డాడు. యూఎస్‌లో చైనీస్ ఫుడ్ దొరకడం చాలా అరుదు. అందులోనూ మంచి ఫుడ్ అంటే కష్టం కదా. అయినా సరే.. తనకు నచ్చిన చైనీస్ ఫుడ్ కోసం గత 40 ఏళ్లలో సుమారు 8 వేల రెస్టారెంట్లకు వెళ్లాడు.
ఒక రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు.. ఆ రెస్టారెంట్లో చైనీస్ వంటకాలు ఏం దొరుకుతాయో లిస్ట్ రాసుకుంటాడు. అలా.. ఎన్ని రెస్టారెంట్లకు వెళితే అన్ని రెస్టారెంట్లకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకుంటాడు.
లాస్ ఏంజెల్స్‌లో నివసిస్తున్న చాన్.. లాస్ ఏంజెల్స్‌లో ఉన్న అన్ని అథెంటిక్ చైనీస్ రెస్టారెంట్లలో టేస్ట్ చేయాలన్నదే నా లక్ష్యంగా ఉండేది అని చెప్పుకొచ్చాడు.
లాస్ ఏంజెల్స్ తర్వాత న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, మిసిసిపీ లాంటి ప్రాంతాలకు కూడా వెళ్లి అక్కడ ఉన్న చైనీస్ ఫుడ్‌ను టేస్ట్ చేసేవాడు చాన్. నిజానికి చాన్ భోజన ప్రియుడేమీ కాదు కానీ యూఎస్‌లో అసలైన చైనీస్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందా అన్న ఒక క్యూరియాసిటీతో అన్ని రెస్టారెంట్లకు తిరిగేవాడట.
సోషల్ మీడియా వచ్చాక.. తను ఏ రెస్టారెంట్లో చైనీస్ ఫుడ్ తిన్నా.. వాటిని ఫోటోలు, వీడియోలు తీసి అందులో పోస్ట్ చేసేవాడట. అలా.. తన ఫుడ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ప్రస్తుతం చాన్ యూఎస్‌లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు.
ఇప్పటి వరకు తను తిన్న రెస్టారెంట్లలో మిసిసిపీలోని చౌమేన్ అనే రెస్టారెంట్లో చైనీస్ ఫుడ్ అద్భుతంగా ఉందట. నార్త్ డకోటాలో మాత్రం చెండాలంగా ఉందట.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Magizhini : అదరగొడుతున్న లెస్బియన్ సాంగ్.. తమిళంలో రిలీజ్ అయిన ఫస్ట్ వీడియో వైరల్
Belly Dance : ‘మనికె మగె హితే’ పాటకు బెల్లీ డ్యాన్స్ చేసి అదరగొట్టేసింది.. వీడియో వైరల్
అక్కడ వారానికి నాలుగు రోజులే పని.. జీతం కూడా కట్ చేయరు
ఫోన్లకు చార్జింగ్ పెట్టుకుంటే జీతం కట్.. ఉద్యోగులకు బాస్ అల్టిమేటం
Prakash Raj : ఆకాశాన్నంటిన టమాటా ధరలు.. ప్రకాశ్ రాజ్ షేర్ చేసిన మీమ్ వైరల్