Prakash Raj : ఆకాశాన్నంటిన టమాటా ధరలు.. ప్రకాశ్ రాజ్ షేర్ చేసిన మీమ్ వైరల్
ప్రకాశ్ రాజ్ షేర్ చేసిన మీమ్ వైరల్ | ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు. సినిమా షూటింగ్‌లు లేకపోతే
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు. సినిమా షూటింగ్‌లు లేకపోతే.. ఇంటి వద్ద ఉన్నప్పుడు.. రాజకీయలు, సినిమాల మీద ట్వీట్లు చేస్తుంటారు. అయితే.. ఈ మధ్య సోషల్ మీడియాలో క్రియేట్ అయ్యే మీమ్స్ చూస్తే ఎక్కువగా ప్రకాశ్ రాజ్ సినిమాల్లోని కొన్ని సీన్లను తీసుకొని.. వాటిని ప్రస్తుత పరిస్థితులకు లింక్ చేసి మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఎక్కువ చర్చనీయంశం అయిన అంశాల్లో పెట్రోల్ ధరలు, టమాటా ధరలు. ముందు పెట్రోల్ ధరలు రాకెట్లా దూసుకుపోయాయి. ప్రస్తుతం టమాటా ధరలు కూడా అలాగే దూసుకుపోతున్నాయి. దీంతో టమాటా ధరల మీద సోషల్ మీడియాలో కుప్పలు కుప్పలుగా మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
తాజాగా.. సింగం సినిమాలోని ఓసీన్ను తీసుకొని దానికి టమాటా ధరలను కలిపి మీమ్స్ క్రియేట్ చేశారు. సూర్య.. ప్రకాశ్ రాజ్‌కు ఫోన్ చేసి.. పెట్రోల్ ధర 100 దాటింది అంటూ ప్రశ్నిస్తాడు. దానికి ప్రకాశ్ రాజ్.. టమాటా ధర 110 రూపాయలకు చేరుకుంది.. అంటూ చెప్పినట్టుగా మీమ్‌ను క్రియేట్ చేశారు.
ఆ మీమ్.. చివరకు ప్రకాశ్ రాజ్ కంట పడింది. దీంతో వెంటనే దాన్ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసి… ఎవరు క్రియేట్ చేశారు దీన్ని.. ఏదో ఊరికే అడుగుతున్నా అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. దీంతో ఆ మీమ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ప్రకాశ్ రాజ్ ట్వీట్‌కు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
Who did this …#justasking pic.twitter.com/Oq86O7sWNg
— Prakash Raj (@prakashraaj) November 25, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఈ పిల్లాడి ముందు స్టార్ హోటల్ చెఫ్ కూడా పనికిరాడు.. వైరల్ వీడియో
అక్కడ వారానికి నాలుగు రోజులే పని.. జీతం కూడా కట్ చేయరు
తల్లికి డెలివరీ చేసి తన పుట్టుకకు కారణం అయిన డాక్టర్‌పై కేసు పెట్టిన యువతి
అన్ని సమాధానాలు చెప్పినా.. ‘బాగా లావుగా’ ఉందని జాబ్ ఇంటర్వ్యూలో రిజెక్ట్ చేశారు
అర్ధరాత్రైనా ఇక్కడ పగల్లాగే ఉంటుంది.. సూర్యుడు అస్తమించని ప్రాంతాలివే..
ఆ కొలతలు ఉన్న అమ్మాయే కావాలి.. మ్యాట్రిమోనిలో ప్రకటన
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్లంబర్ విమానాన్ని దించగలడా?
కశ్మీర్ బస్సులపై రెండ్రోజుల్లో రెండు దాడులు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

