e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, November 29, 2021
Home News అర్ధ‌రాత్రైనా ఇక్క‌డ పగ‌ల్లాగే ఉంటుంది.. సూర్యుడు అస్త‌మించ‌ని ప్రాంతాలివే..

అర్ధ‌రాత్రైనా ఇక్క‌డ పగ‌ల్లాగే ఉంటుంది.. సూర్యుడు అస్త‌మించ‌ని ప్రాంతాలివే..

Sunset
Sunset

Sunset |సూర్యుడు ఏ దిక్కున ఉద‌యిస్తాడు? ఇదేం ప్ర‌శ్న.. సూర్యుడు తూర్పున ఉద‌యిస్తాడు.. ప‌డ‌మ‌ర అస్త‌మిస్తాడు.. అని పుస్త‌కాల్లో చ‌దువుకున్న‌దే క‌దా ఆ మాత్రం తెలియ‌దా అని అంటారా? క‌రెక్టే అనుకోండి.. కాసేపు సూర్యోద‌యం గురించి ప‌క్క‌న‌పెట్టి.. సూర్యాస్త‌మ‌యం ( Sunset ) గురించి చూద్దాం.. ఈ భూమ్మీద సూర్యుడు అస్త‌మించ‌ని ప్రాంతాలు కొన్ని ఉన్నాయ‌న్న సంగ‌తి తెలుసా ! అర్ధ‌రాత్రి అయినా కూడా అక్క‌డ ప‌ట్ట‌ప‌గల్లాగే ఉంటుంది. 24 గంట‌లూ సూర్యుడు వెలిగిపోతూనే ఉంటాడు.. ఆశ్చ‌ర్యంగా ఉంది క‌దూ !! మ‌రి ర‌వి అస్త‌మించ‌ని ఆ ప్రాంతాలేంటో చూద్దామా..

నార్వే

ఏడాదిలో చాలా కాలం పాటు నార్వేలో సూర్యుడు అస్త‌మించ‌డు. అర్ధ‌రాత్రి కూడా ప‌ట్ట‌ప‌గ‌లు మాదిరి ఎండ కొడుతుంది. అందుకే నార్వే దేశాన్ని అర్ధ‌రాత్రి సూర్యుడు ఉద‌యించే ప్రాంతం ( ల్యాండ్ ఆఫ్‌ మిడ్‌నైట్ స‌న్ ) అని కూడా పిలుస్తారు. అక్షాంశానికి ఎక్కువ ఎత్తులో ఉండ‌టం వ‌ల్లే ఇక్క‌డ కొద్దిరోజుల పాటు సూర్యుడు అస్త‌మించ‌డు. మే నుంచి జూలై మ‌ధ్య‌లో దాదాపు 70 రోజుల పాటు సూర్యుడు నిరంత‌రం ప్ర‌కాశిస్తూనే ఉంటాడు. ఒక రోజులో కేవ‌లం నాలుగు గంట‌లు మాత్రం మ‌బ్బుల చాటుకు వెళ్తాడు. నార్వేలోని స్వాల్ బార్డ్‌లో ఏప్రిల్ 10 నుంచి ఆగ‌స్టు 23 వ‌ర‌కు సూర్యుడు నిరంత‌రం ప్ర‌కాశిస్తూనే ఉంటాడు.

ఫిన్లాండ్‌

- Advertisement -

అంద‌మైన స‌ర‌స్సులు, ద్వీపాల‌కు పెట్టింది పేరు ఫిన్లాండ్‌. ఈ దేశంలో ఎండాకాలంలో 70 రోజుల పాటు సూర్యుడు అస‌లే అస్త‌మించ‌డు. అర్ధ‌రాత్రి కూడా ప‌ట్ట‌ప‌గ‌ల్లాగే క‌నిపిస్తుంది. అయితే చలికాలంలో మాత్రం అస‌లు సూర్యుడే క‌నిపించ‌డు.

ఐస్‌లాండ్‌

యూర‌ప్‌లో ఉన్న అతిపెద్ద ద్వీపం ఐలాండ్‌. ఇక్క‌డ ఆవాస ప్రాంతాలు త‌క్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ.. ప‌ర్యాట‌కంగా దీనికి మంచి ఆద‌ర‌ణ ఉంది. ఇక్క‌డ జూన్ నెల‌లో సూర్యుడు అస్త‌మించడు. ఆ నెల రోజులు ప‌గ‌లు, రాత్రి తేడా ఉండ‌దు. అందుకే జూన్ నెల‌లో ఇక్కడికి ప‌ర్యాట‌కులు ఎక్కువ‌గా వ‌స్తుంటారు. ఐస్‌లాండ్‌లో దోమ‌లు కూడా ఉండ‌క‌పోవ‌డం మ‌రో ప్ర‌త్యేక‌త‌.

కెన‌డా

ప్ర‌పంచంలోని రెండో అతిపెద్ద దేశం కెనడా. ఇక్క‌డి యుకోన్‌లో ఏడాది పొడ‌వునా మంచు కురుస్తూనే ఉంటుంది. అయితే 50 రోజులు మాత్రం వేస‌వి కాలం ఉంటుంది. ఈ కాలంలో అర్ధ‌రాత్రి కూడా సూర్యుడు ఉద‌యిస్తూనే ఉంటాడు. అందుకే ఈ 50 రోజుల్లో అనేక పండుగ‌లు, ఉత్స‌వాలు నిర్వ‌హిస్తారు. ఇందులో భాగంగానే ప్ర‌తి ఏటా జూలై మ‌ధ్య‌లో గ్రేట్ నార్త‌ర్న్ ఫెస్టివ‌ల్ కూడా జ‌రుపుకుంటారు. గోల్ఫ్ ఈవెంట్లు కూడా నిర్వ‌హిస్తారు. చ‌లికాలంలో మాత్రం నునావ‌ట్‌లో 30 రోజుల పాటు సూర్యుడు క‌నిపించ‌డు.

స్వీడ‌న్‌

స్వీడ‌న్‌లోని కిరున్ న‌గ‌రంలో అయితే ఏడాదిలో దాదాపు వంద రోజుల పాటు సూర్యుడు అస్త‌మించ‌డు. మే నుంచి ఆగ‌స్టు మ‌ధ్య‌లో సూర్యుడు ఎప్పుడూ ప్ర‌కాశిస్తూనే ఉంటాడు. అందుకే ఈ స‌మ‌యంలో ఈ న‌గ‌రాన్ని చూసేందుకు ప్ర‌జ‌లు త‌ర‌లివ‌స్తుంటారు. దీంతోపాటు కిరున్ ఆర్ట్ నోయువే చ‌ర్చి కూడా చాలా పాపుల‌ర్‌. ఈ చ‌ర్చి ఆర్కిటెక్చ‌ర్ చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే కిరున్‌లోని ఈ చ‌ర్చిని చూసేందుకు కూడా టూరిస్టులు ఎక్కువ‌గా వస్తుంటారు.

అలస్కా

అమెరికాకు చెందిన‌ అలాస్కాలోని బారోలో మే నుంచి జూలై వ‌ర‌కు సూర్యుడు అస్త‌మించ‌డు. అర్ధ‌రాత్రి కూడా సూర్యుడు వెలుగులు విర‌జిమ్ముతూనే ఉంటాడు. కానీ న‌వంబ‌ర్ నెల‌లో 30 రోజులు మాత్రం చీక‌టిగా ఉంటుంది. దీన్నే పోలార్ నైట్ అని పిలుస్తారు.

కానాక్‌, గ్రీన్‌లాండ్‌

గ్రీన్‌లాండ్‌లో ఉత్త‌రంవైపు ఉండే కానాక్ న‌గ‌రం.. చలికాలంలో పూర్తిగా చీక‌ట్లోనే ఉంటుంది. అదే వేస‌వికాలంలో ఏప్రిల్ నుంచి ఆగ‌స్టు మ‌ధ్య మాత్రం సూర్యుడు రోజంతా ప్ర‌కాశిస్తూనే ఉంటాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

త‌న‌ను తానే పెళ్లి చేసుకుంది.. త‌ర్వాత విడాకులు ఇచ్చుకుంది.. అస‌లేంటి ఈమె స్టోరీ

Whistle village : ఆ ఊళ్లో పేర్లు ఉండ‌వ్‌.. విజిల్‌తోనే పిలుచుకుంట‌రు

floating breakfast | ఈ బ్రేక్‌ఫాస్ట్‌ తినాలంటే.. లక్షలు ఖర్చు చేయాల్సిందే. ఏంటి దీని స్పెష‌ల్‌.. సెల‌బ్రెటీల‌కు ఎందుకు ఇష్టం?

Red crabs : కోట్ల సంఖ్య‌లో రోడ్ల మీదికొచ్చిన పీత‌లు.. స్థంభించిన జనజీవనం.. ఎక్కడో తెలుసా?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement