England : సుదీర్ఘ ఫార్మాట్లో ఇంగ్లండ్ జట్టుకు కొత్త కోచ్‌ను చూసుకోవాల్సిన రోజులొచ్చేశాయి. అండర్సన్ -టెండూల్కర్ ట్రోఫీలో తడబాటు, యాషెస్ సిరీస్‌లో ఆ జట్టు చెత్త ఆటను చూశాక.. బ్రెండన్ మెక్కల్లమ్ (Brendon McCullum) స్థానంలో కొత్తవారికి బాధ్యతలు ఇవ్వాలనే డిమాండ్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి(Ravi Shastri) అయితేనే మంచిదని ఆ దేశ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ అభిప్రాయపడగా.. మాజీ కెప్టెన్ మాత్రం అలెస్టర్ కుక్ (Alastair Cook) రేసులో ఉన్నాడని అంటున్నాడు.
యాషెస్ సిరీస్‌లో బ్యాటింగ్ వైఫల్యంతో ఇంగ్లండ్ చేజేతులా సిరీస్ సమర్పించుకుంది. హ్యాట్రిక్ ఓటములతో లొంగిపోయిన బెన్ స్టోక్స్ ఎట్టకేలకు మెల్బోర్న్లో విజయంతో మురిసినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. దాంతో.. వెంటనే బ్రెండన్ మెక్‌కల్లమ్‌ను తప్పించాలని మాజీ ఆటగాళ్లు అంటున్నారు. తాజాగా ఆ జట్టు మాజీ కెప్టెన్ మైఖేల్ ఆర్థర్టన్ ది టైమ్స్ కథనంలో ఇంగ్లండ్ టెస్టు జట్టుకు కొత్త కోచ్ అవసరాన్ని నొక్కి చెప్పాడు. మెక్కల్లమ్ వారసుడిగా అలెస్టర్ కుక్ మంచి ఎంపిక అని అతడు పేర్కొన్నాడు.
Brendon McCullum is looking for the answers while doing a crossword puzzle.😂😄
(🎥- 7Cricket) pic.twitter.com/VitDDR3Qo7
— Cricket Sangrah (@CricketSangrah) January 4, 2026
‘ఇదే విషయమై కుక్‌ను సంప్రదించగా అతడు నేను సిద్ధమే అని అంటున్నాడు. నేను ఏమీ చెప్పలేను. అయితే.. ఆర్థర్టన్ 800 పదాల అర్టికల్‌లో 600 పదాలే పూర్తి చేశాడు. ఇంకా 200 పదాలున్నాయి. ఇప్పటివరకైతే ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు నన్ను సంప్రదించలేదు. ఒకవేళ నన్ను కోచ్‌గా ఎంపిక చేస్తే రఫ్ఫాడిస్తా. కచ్చితంగా ఫలితాలు చూపిస్తాను’ అని కుక్ వెల్లడించాడు. ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాళ్లలో ఒకడైన కుక్. 161 మ్యాచుల్లో 33 శతకాలు బాదాడు. క్రికెట్‌కు విశేష సేవలందించిన అతడికి 2019లో నైట్‌హుడ్ గౌరవం దక్కింది.
Sir Alastair Cook has expressed his interest in the England coaching job. pic.twitter.com/nG95asUclc
— Circle of Cricket (@circleofcricket) January 4, 2026
ఒకప్పుడు ‘బజ్ బాట’తో ప్రత్యర్థులను బెంబేలెత్తించిన ఇంగ్లండ్ యాషెస్ సిరీస్(Ashes Series)లో చతికిలపడింది. మళ్లీ ఇంగ్లండ్ గాడీలో పడాలంటే అది రవి శాస్త్రి (Ravi Shastri) వల్లే అవుతోందనిమాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్(Monty Panesar) అంటున్నాడు. ‘ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించడం అతడికి తెలుసు. మానసికంగా, శారీరకంగా, వ్యూహాత్మకంగా ఆసీస్ ఆటగాళ్ల బలహీనతలను అతడు అనుకూలంగా మలచుకోగల సమర్ధుడు. అందుకే.. బ్రెండన్ మెక్కల్లమ్ వెళ్లిపోయాక ఇంగ్లండ్ తదుపరి కోచ్‌గా రవిశాస్త్రి ఎంపికవ్వాలి. అతడైతేనే జట్టును మళ్లీ గెలుపు తోవ తొక్కిస్తాడు’ అని పనేసర్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.