Mr. Work From home | విలక్షణమైన పాత్రలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటుడు త్రిగుణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. మధుదీప్ చెలికాని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను చిత్ర యూనిట్ ఘనంగా విడుదల చేసింది. త్రిగుణ్ సరసన పాయల్ రాధాకృష్ణ కథానాయికగా నటించగా, ప్రముఖ నటుడు అనీష్ కురువిల్లా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అరవింద్ మండెం ఈ చిత్రాన్ని నిర్మించారు. CH.V.S.N బాబ్జీ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
టీజర్ లాంచ్ కార్యక్రమంలో హీరో త్రిగుణ్ మాట్లాడుతూ సినిమాపై తనకున్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ వేడుకకి విచ్చేసిన అతిధులు అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా చిన్న సినిమాలన్నీ అద్భుతంగా ఆడుతున్నాయి .అందరికి ఒక హోప్ వచ్చింది. సినిమాలు చూడడం థియేటర్ కి రావడం చాలా ఆనందంగా ఉంది. బాబ్జి గారికి థాంక్యూ తక్కువ టికెట్ ధరల్లో పెడితే ఆడియన్స్ అందరూ వచ్చి చూస్తారని భావిస్తున్నాను. మోడరన్ లైఫ్, పాత పద్ధతిలో ఉన్న వ్యవసాయాన్ని ఎలా కలపొచ్చు అనేది ఈ సినిమాల్లో చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. చాలా ముఖ్యమైన విషయాలు ఇందులో చెప్పాం. మనమందరం కూడా వ్యవసాయం నుంచే వచ్చాము. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అన్ని తరాలు కూడా వ్యవసాయం నుంచే వచ్చాయి. వ్యవసాయం గురించి ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుతూనే సినిమా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్ యూ. త్వరలోనే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తాం. తప్పకుండా ఈ సినిమాని మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ మధుదీప్ మాట్లాడుతూ… అందరికి నమస్కారం. నేను ఈ ఇండస్ట్రీలో ఉండడానికి కారణం చంటి గారు. ఆయన లేకపోతే ఈ జర్నీ ఇంత స్మూత్ గా జరిగేది కాదు. ఈ వేడుకకు విచ్చేసిన అతిధులు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. చినప్పుడు విన్న ఒక మాట నా మనసులో బలంగా ముద్రపడిపోయింది. వ్యవసాయ భూమి ఎందుకు అమ్ముకోవాల్సి వస్తుందంటే.. వ్యవసాయం చేసే విధానంలో మార్పు రావాలి.. ఈ ఆలోచనతో చేసిన కథ. ఇది చాలా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాకి టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు. ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ హత్తుకునేలా వుంటుంది. హీరో త్రిగుణ్ గారితో వర్క్ చేయడం చాలా ఆనందాన్నిచ్చింది మాది. 5 ఏళ్ల జర్నీ. మొదటి రోజు ఎలా ఉన్నామో ఇప్పుడు అలానే ఉన్నాము. బాబ్జి గారు చాలా మంచి మనిషి. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఎండ్ కార్డ్ వరకు మీ మొహం లో చిరునవ్వు ఎక్కడికి పోదు. ఈ సినిమా ఆనందంపజేస్తుంది, ఆలోచింపచేస్తుంది. సినిమా చూసిన తర్వాత అందరూ కూడా చిరునవ్వుతో బయటకు వస్తారు.
పాయల్ మాట్లాడుతూ.. ఇది నేను ఫస్ట్ సైన్ చేసిన ఫిలిం. ఈ ప్రాజెక్ట్ నాకు చాలా స్పెషల్. కథ చెప్పినప్పుడు నేను చాలా పర్సనల్‌గా కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే మా పేరెంట్స్ కూడా గ్రామాల్లోనే ఉంటారు. ప్రతి ఒక్కరికి వ్యవసాయం మీద ఆసక్తి ఉండాలనేది మా ఆలోచన. తప్పకుండా ఈ సినిమా మీ అందరిని అలరిస్తుందని నమ్ముతున్నాను.
అనీష్ కురివిల్లా మాట్లాడుతూ.. నేను ఎక్కువ శాతం ఫస్ట్ టైం డైరెక్టర్స్ ప్రొడ్యూసర్ దగ్గర పని చేశాను. ఆ విషయంలో చాలా గర్వంగా ఉంది. ఇది చాలా స్పెషల్ ఫిలిం. మధు అరవింద్ చాలా ఫ్యాషన్ తో పనిచేశారు. కథని నమ్మి చేసిన సినిమా ఇది. సినిమాలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. అది చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటూ మీ అందరిని అలరిస్తుం.చాలా సరదాగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తారు
సత్య కృష్ణ మాట్లాడుతూ.. ఒక రైతు పడే తపన సిటీలో చదువుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటే వాళ్లకి ఎంత హెల్ప్ అవుతుంది అనేది ఈ సినిమాలో చాలా అద్భుతంగా చూపించారు. మనందరం అల్టిమేట్ గా భోజనం చేసే బ్రతకాలి. అది కావాలంటే రైతులు పండించాలి. పండించడం అనేది చాలా కష్టమైన పని. దానిపై ఒక సినిమా చేయడమనేది చాలా గొప్ప విషయం. ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా మీ అందరిని అలరిస్తుంది
ప్రొడ్యూసర్ అరవింద్ మాట్లాడుతూ .. ఈ వేడుకకు విచ్చేసిన పెద్దలకు మీడియా మిత్రులకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది ఒక ఇంపార్టెంట్ కంటెంట్ ఉంటూనే హైలీ ఎంటర్టైంగా ఉండే సినిమా. ఈ ఈవెంట్ కి పల్స్ ఆఫ్ వర్కింగ్ ఫ్రొం హోం అని పెట్టాం. ఈ సినిమా పల్స్ ఏమిటో ఆడియన్స్ కి తెలియాలని. అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఉంటూనే మీనింగ్ ఫుల్ మెసేజ్ కూడా ఉంటుంది. త్వరలోనే ఈ సినిమా నుంచి మరింత ప్రమోషనల్ కంటెంట్ మీ ముందుకు వస్తుంది. తప్పకుండా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తాం.
ప్రెసెంటర్ బాబ్జి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ వేడుకకు వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. సినిమా అద్భుతంగా వచ్చింది. ఇది మామూలు సినిమా కాదు టీజర్ శాంపిల్ మాత్రమే. ట్రైలర్ అదిరిపోతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు అద్భుతంగా ఎంజాయ్ చేసే సినిమా ఇది. సినిమా చాలా పెద్ద హిట్ ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
అశోక్ కుమార్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మూడు రోజుల క్రితమే ఈ కంటెంట్ చూపించారు. వర్క్ ఫ్రం హోం అనేది చాలా అద్భుతమైన టైటిల్. చాలామంది యువకులు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు విడిచిపెట్టి ఆర్గానిక్ వ్యవసాయం వైపు రావడం మనం గమనిస్తూ ఉంటాం. రానున్న రోజుల్లో వ్యవసాయం అనేది అగ్రస్థానంలో అగ్రస్థానంలోకి వెళ్తుంది. ఈ సినిమా చూసిన తర్వాత కచ్చితంగా వ్యవసాయం మీద చాలా ఒక అభిప్రాయం లో చాలా మంచి మార్పు వస్తుంది అని నమ్మకం ఉంది. అగ్రికల్చర్ ని మనం ఏదో రకంగా సపోర్ట్ చేయాలి. చదువుకున్న టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళందరికీ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళగళ్తే మన దేశం కూడా అగ్రస్థానంలో ఉంటుంది. చాలా మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. కచ్చితంగా సినిమా మంచి విజయాన్ని సాధిస్తుంది
దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. టీజర్ చుసిన తర్వాత చాలా అనందంగా అనిపించింది. ఇలాంటి పాయింట్ తో పదేళ్ళ క్రితం ఓ కథని మేము అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఆ తరహ అంశాన్ని చాలా అద్భుతంగాచూపించారు. ఈ సినిమాలో చేసిన చాలామంది నాకు తెలుసు. సాఫ్ట్వేర్ నుంచి సినిమాల్లోకి చాలా మంది వస్తున్నారు. ఇది శుభ పరిణామం. సినిమా టీజర్ చాలా బావుంది. త్రిగుణ్ కు మరో విజయం వస్తుందని నమ్మకం ఉంది. డైరెక్టర్ గారు మంచి స్క్రిప్ట్ తో పాటు నటీనటులని ఎంపిక చేసుకున్నారు . సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
బివిస్ రవి మాట్లాడుతూ.. టీజర్ చూస్తున్నప్పుడు ఇందులో కథ ఉందని అనిపించింది. టీజర్ లో కథ చెప్పిన సినిమాలు హిట్ అయ్యాయి. ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంటుంది అని నమ్మకం ఉంది. ఈ సినిమాలో వ్యవసాయం గురించి మిల్లెట్స్ గురించి డిస్కస్ చేసినట్టుగా టీజర్ చూస్తే అనిపిస్తుంది. ప్రధాని మోడీ గారు కూడా మిల్లెట్స్ గురించి మాట్లాడారు. త్రిగుణ్ చాలా అద్భుతమైన పెర్ఫార్మర్. చాలా మంచి సినిమాలు చేస్తున్నాడు. ఈషాతో మంచి హిట్ కొట్టాడు. అరవింద్ మధు చాలా పాషన్ తో ఈ సినిమా చేశారు. తప్పకుండా ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుంది.
నటీనటులు: త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ & అనీష్ కురువిల్లా, శివాజీరాజా, హర్ష వర్ధన్, సత్య కృష్ణన్, హర్ష చెముడు, నెల్లూరు సుదర్శన్, సివిఎల్ నర్సింహారావు, గుండు సుదర్శన్, వేణు యెల్దండి, సప్తగిరి, గిరిధర్, సరయు, సత్తిపండు.

Mr. Work From Home team
దర్శకత్వం: మధుదీప్ చెలికాని
నిర్మాత: అరవింద్ మండెం
సమర్పణ: CH.V.S.N బాబ్జీ
బ్యానర్ : లోటస్ క్రియేటివ్ వర్క్స్
స్క్రిప్ట్ కోఆర్డినేటర్: పవన్ కొడాలి
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: రవికుమార్ వి.
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం: ప్రకాష్ చెరుకూరి
సౌండ్ డిజైనర్: సంతోష్ వొదనల
యాక్షన్ కొరియోగ్రఫీ: రామ్ సుంకర
పబ్లిసిటీ డిజైన్స్: JK ఫ్రేమ్స్
PRO: తేజస్వి సజ్జా