వంట చేయడం అనేది ఒక ఆర్ట్. ఇదివరకు వంట చేసేవాళ్లు అంటూ ఛీప్‌గా చూసేవాళ్లు. కానీ… ఇప్పుడు వంట చేసేవాళ్లకు ఉన్నంత గిరాకీ ఇంకెవరికీ లేదు. రోడ్డు మీద ఉండే బండి మీద వంట వండే వాళ్ల దగ్గర్నుంచి.. స్టార్ హోటళ్లలో పనిచేసే చెఫ్ వరకు అందరికీ.. ఇప్పుడున్న డిమాండే వేరు. దీంతో ఈ రంగంలోకి చాలామంది దిగుతున్నారు.
చాలామంది.. వంటనే తమ వృత్తిగానూ ఎంచుకుంటున్నారు. తాజాగా ఫరీదాబాద్‌కు చెందిన 13 ఏళ్ల బాలుడు రోడ్డు పక్కన ఉన్న బండి వద్ద చైనీస్ వంటకాలు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మన దగ్గర చైనీస్ వంటకాలకు కూడా ఫుల్ డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. ఆ పిల్లాడు.. చైనీస్ వంటకాలను అలవోకగా.. స్టయిల్‌గా చేయడాన్ని నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా చిల్లీ పొటాటోను వండటం చూసి.. నీకింద స్టార్ హోటల్ చెఫ్ కూడా పనికిరాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
తల్లికి డెలివరీ చేసి తన పుట్టుకకు కారణం అయిన డాక్టర్‌పై కేసు పెట్టిన యువతి
ఇలాంటి ప్రశ్నాపత్రాన్ని ఇప్పటి వరకు చూసి ఉండరు.. అందులోని ఓ ప్రశ్న ఏంటో తెలిస్తే ఫిదా అవుతారు
సముద్రగర్భంలో 4000 ఫీట్ల లోతులో నివసించే అరుదైన చేప ఇది.. ఫోటోలు వైరల్
అన్ని సమాధానాలు చెప్పినా.. ‘బాగా లావుగా’ ఉందని జాబ్ ఇంటర్వ్యూలో రిజెక్ట్ చేశారు