ఎగ్జామ్ అంటే చాలు.. విద్యార్థులు భయపడిపోతారు. ఈ ఎగ్జామ్స్ ఏంట్రా బాబు అని విసుక్కుంటారు. ఈ పరీక్షల గోల ఎప్పుడు పోతుంది అని టెన్షన్ పడుతుంటారు. కానీ.. విద్యార్థులు అన్నప్పుడు పరీక్షలు రాయడం కామన్.
కొందరు విద్యార్థులు అయితే.. రాత్రింబవళ్లు పుస్తకాలతో కుస్తీలు పడుతుంటారు. తీరా పరీక్ష రాసే సమయానికి.. పేపర్ చూస్తే అందులో చదివిన టాపిక్ నుంచి ఒక్క ప్రశ్న కూడా అడగరు. దీంతో ఏం చేయాలో తెలియక బిక్కమొహం వేసుకొని చూస్తుంటారు.
కానీ.. ఈ ప్రశ్నాపత్రాన్ని చూస్తే మాత్రం బిక్కమొహం వేసుకొని చూడాల్సిన అవసరం లేదు. ఏమాత్రం టెన్షన్ లేకుండా హాయిగా పరీక్ష రాసి.. దర్జాగా కాలరెగరేసుకొని పరీక్ష హాల్ నుంచి బయటికి రావచ్చు.
ఎందుకు.. ఆ ప్రశ్నాపత్రంలో ఏముంది.. అసలు ప్రశ్నలు ఉన్నాయా లేవా అంటారా? ప్రశ్నలు ఉన్నాయి కానీ.. చివర్లో అడిగిన ఆ ఒక్క ప్రశ్నను చూస్తే మీ మతి పోవాల్సిందే.
ఇంతకీ ఈ ప్రశ్న ఏంటంటారా? మీరు ఎంతో కష్టపడి చదివినా.. కొన్ని టాపిక్స్ గురించి పరీక్షలో అడగని కొన్ని ప్రశ్నలు ఉంటాయి. అలా కష్టపడి చదివిన దాంట్లో పరీక్షలో అడగని టాపిక్ ఏదైనా ఉందా? ఉంటే ఆ టాపిక్ గురించి డిటెయిల్గా వివరించండి.. అనేదే ప్రశ్న.
అబ్బ.. ఇలాంటి ప్రశ్న అడిగితే ఎవరు మాత్రం ఆన్సర్ రాయరు. ఖచ్చితంగా పరీక్ష కోసం ఎంతో కొంత చదువుతాం కదా. దాన్నే రాసేసి ఈజీగా పాస్ అయిపోవచ్చు.. అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక.. ఆ ప్రశ్న మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
I kind of like this exam question. pic.twitter.com/BOLqknhPNX
— 🧬 Rebekah L. Rogers 🧬 (@evolscientist) November 18, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సముద్రగర్భంలో 4000 ఫీట్ల లోతులో నివసించే అరుదైన చేప ఇది.. ఫోటోలు వైరల్
అన్ని సమాధానాలు చెప్పినా.. ‘బాగా లావుగా’ ఉందని జాబ్ ఇంటర్వ్యూలో రిజెక్ట్ చేశారు
డూనట్స్, బర్గర్స్ వద్దు.. వడ, దోశ, వడపావే ముద్దు.. సోషల్ మీడియాలో సరికొత్త ఉద్యమం
Viral Video : ఏడుస్తున్న కోడి.. ఓదార్చిన వ్యక్తి.. నెటిజన్లు ఏమంటున్నారంటే?
తనను తానే పెళ్లి చేసుకుంది.. తర్వాత విడాకులు ఇచ్చుకుంది.. అసలేంటి ఈమె స్టోరీ