సముద్రగర్భం లోపల చాలా రకాల జాతుల చేపలు, ఇతర జీవులు నివసిస్తుంటాయి. అవి ఎక్కడో సముద్రగర్భంలో కొన్ని వేల ఫీట్ల లోతులో ఉంటాయి. కాబట్టి.. ఆ జీవులను మనం చూడలేం. కొన్ని రకాల చేపలు కూడా అంటే. వాటిని మనం ఒక్కసారి కూడా చూసి ఉండం. ఎందుకంటే అవి ఎక్కడో లోతులో ఉంటాయి.
కాకపోతే.. అప్పుడప్పుడు కొన్ని జీవులు సముద్రపు ఒడ్డుకు కొట్టుకొస్తుంటాయి. వాటికి ఏదైనా అయినా.. అవి చనిపోయినా.. ఒడ్డుకు కొట్టుకొస్తాయి. అలా ఓ అరుదైన చేప ఒడ్డుకు కొట్టుకొచ్చింది. కాలిఫోర్నియాలోని సాన్ డియెగోలోని టోర్రీ పైన్స్లో ఉన్న బ్లాక్స్ బీచ్‌కు ఆ చేప కొట్టుకొచ్చింది.
ఆ చేప పేరు ఫుట్బాల్ఫిష్. దాన్నే పసిఫిక్ ఫుట్బాల్ఫిష్ అని కూడా పిలుస్తారు. బీచ్‌కు కొట్టుకొచ్చిన ఆ చేపను చూసిన జే బిలియెర్ అనే వ్యక్తి దాన్ని జెల్లిఫిష్ అనుకున్నాడు. కానీ అది జెల్లిఫిష్ కాదు.. అనే విషయం ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత తెలిసింది.
ఫుట్బాల్ఫిష్ అనే చేప… సముద్రగర్భంలో 3000 నుంచి 4000 ఫీట్ల లోతులో నివసిస్తుంది. అవి ఉష్ణమండల, ఉప ఉష్ణమండల వాతావరణం ఉన్న నీళ్లలోనే జీవిస్తాయి. అటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్న అట్లాంటిక్, ఇండియన్, పసిఫిక్ సముద్రాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి.
ఈ చేపను మొదటగా జువాలజీ ప్రొఫెసర్ జోహన్ రేన్హార్ట్ 1837లో కనుగొన్నాడు. ఈ చేపకు కత్తిలాంటి పదునైన పళ్లు ఉంటాయి. ఈ చేప అప్పుడప్పుడు ఇలా బీచ్‌కు కొట్టుకొచ్చి కనిపిస్తుంటాయి కానీ.. చాలా అరుదుగా ఇవి బయట కనిపిస్తాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
అన్ని సమాధానాలు చెప్పినా.. ‘బాగా లావుగా’ ఉందని జాబ్ ఇంటర్వ్యూలో రిజెక్ట్ చేశారు
డూనట్స్, బర్గర్స్ వద్దు.. వడ, దోశ, వడపావే ముద్దు.. సోషల్ మీడియాలో సరికొత్త ఉద్యమం
Viral Video : ఏడుస్తున్న కోడి.. ఓదార్చిన వ్యక్తి.. నెటిజన్లు ఏమంటున్నారంటే?
తనను తానే పెళ్లి చేసుకుంది.. తర్వాత విడాకులు ఇచ్చుకుంది.. అసలేంటి ఈమె స్టోరీ