అన్ని సమాధానాలు చెప్పినా.. ‘బాగా లావుగా’ ఉందని జాబ్ ఇంటర్వ్యూలో రిజెక్ట్ చేశారు
'బాగా లావుగా' ఉందని జాబ్ ఇంటర్వ్యూలో రిజెక్ట్ చేశారు | సాధారణంగా కొన్ని కంపెనీలు.. ఉద్యోగ నియామకాలను రిక్రూటర్లకు అప్పగిస్తాయి. ఏవైనా వెకెన్సీలు ఏర్పడినప్పుడు.. ఉద్యోగులను తీసుకునే బాధ్యత రిక్రూటర్ల మీద ఉంటుంది.
సాధారణంగా కొన్ని కంపెనీలు.. ఉద్యోగ నియామకాలను రిక్రూటర్లకు అప్పగిస్తాయి. ఏవైనా వెకెన్సీలు ఏర్పడినప్పుడు.. ఉద్యోగులను తీసుకునే బాధ్యత రిక్రూటర్ల మీద ఉంటుంది. ఆయా ఉద్యోగాలకు సరిపోయే సరైన క్యాండిడేట్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. క్లయింట్స్ కోసం ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే.. ఒక్కోసారి రిక్రూటర్లు సెలెక్ట్ చేసిన క్యాండిడేట్లను కంపెనీలు తీసుకోవు. వాళ్లు ఓకే చెప్పినా.. కొన్ని చిన్న చిన్న కారణాలు చెప్పి కొందరిని రిజెక్ట్ చేస్తుంటారు.

తాజాగా అటువంటి ఘటనే ఒకటి యూకేలో చోటు చేసుకుంది. కానీ.. సిల్లీ రీజన్ చెప్పి ఉద్యోగానికి రిజెక్ట్ చేసిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రాపర్టీ రిక్రూట్మెంట్ సంస్థ డైరెక్టర్ ఫాయె ఏంజెలెట్టా తన క్లయింట్ కంపెనీలో సేల్స్ పొజిషన్ కోసం ఇంటర్వ్యూలు తీసుకుంది. అందులో ఒక యువతిని సెలెక్ట్ చేసుకుంది. వెంటనే ఆ యువతి డిటెయిల్స్ క్లయింట్‌కు పంపించింది. కానీ.. ఆ క్లయింట్ మాత్రం ఆ యువతిని రిజెక్ట్ చేసింది. తనను ఎందుకు రిజెక్ట్ చేశారో కారణం చూసి ఏంజెలెట్టా షాక్ అయింది.
ఆ యువతి లావుగా ఉందని తనను ఆ ఉద్యోగానికి ఎంపిక చేయలేదని క్లయింట్ నుంచి సమాధానం వచ్చింది. నిజానికి.. ఆ యువతి అంతగా ఏమీ లావు లేదు. తన సైజ్ 16 మాత్రమే. అది యూకేలో కామన్. అయినప్పటికీ.. తను లావుగా ఉందని.. ఉద్యోగంలోకి తీసుకోకపోవడం పెద్ద తప్పిదం. నేను ఇప్పటి వరకు ఇలాంటి కారణాలతో ఉద్యోగులను రిజెక్ట్ చేయడం చూడలేదు. ఇప్పుడు నేను ఆ యువతికి ఎలా ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి అంటూ ఏంజెలెట్టా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇంటర్వ్యూలో అన్ని సమాధానాలు చెప్పినా.. ఇంటర్వ్యూలో బాగా పర్ఫార్మ్ చేసినా.. ఇలాంటి సిల్లీ కారణాలతో రిజెక్ట్ చేయడం కరెక్ట్ కాదని ఏంజెలెట్టా కంపెనీకి చెప్పినా.. వాళ్లు వినలేదు. ఆ యువతిని ఉద్యోగంలోకి తీసుకోలేదు.
నువ్వు లావుగా ఉన్నందున నిన్ను ఈ ఉద్యోగంలోకి తీసుకోలేదు.. అని ఏంజెలెట్టా ఆ లేడీకి ఫీడ్‌బ్యాక్ ఇవ్వడంతో.. మీరు జోక్ చేస్తున్నారా? అంటూ ఆ లేడీ.. ఏంజెలెట్టాను అడిగింది. గతంలో తను క్యాన్సర్‌తో పోరాడిందని.. స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల మాత్రమే కాస్త లావెక్కిందని.. అదే విషయాన్ని రిక్రూటర్.. క్లయింట్‌కు చెప్పినా.. నో అనే సమాధానమే వచ్చిందట.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
డూనట్స్, బర్గర్స్ వద్దు.. వడ, దోశ, వడపావే ముద్దు.. సోషల్ మీడియాలో సరికొత్త ఉద్యమం
Viral Video : ఏడుస్తున్న కోడి.. ఓదార్చిన వ్యక్తి.. నెటిజన్లు ఏమంటున్నారంటే?
తనను తానే పెళ్లి చేసుకుంది.. తర్వాత విడాకులు ఇచ్చుకుంది.. అసలేంటి ఈమె స్టోరీ
Amazon Marijuana Scandal : గంజాయి స్కామ్‌లో బుక్కయిన అమెజాన్.. నెటిజన్ల ఫన్నీ మీమ్స్ వైరల్
బీరు గ్లాస్ ఎలా కిందపడిపోయిందో ఈ వీడియో చూసి చెప్పండి చూద్దాం
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

