భారతదేశ ప్రజల సంప్రదాయాలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో రకరకాల సంప్రదాయాలు ఉంటాయి. ఇతర దేశాల్లో మన దగ్గర ఉన్నట్టువంటి సంప్రదాయాలు చాలా తక్కువ. అందుకే.. భిన్నత్వంలో ఏకత్వం అని దేశాన్ని అందరూ పొగుడుతుంటారు. మనం ఉదయం లేవగానే.. అల్పాహారం తీసుకుంటాం. అందులో వడ, దోశ, ఇడ్లీ, పూరీ లాంటి వాటిని చట్నీతో కలిపి తింటాం.
కానీ.. విదేశాల్లో ఇవేవీ తినరు. వాళ్లు ఎప్పుడూ బ్రెడ్సే తింటారు. డూనట్స్, బర్గర్, టాకో లాంటివి మనకు పడవు. కానీ.. ఇప్పుడు ఎక్కువగా వెస్టర్న్ ఫుడ్‌కు అలవాటు పడ్డారు జనాలు. అందుకే.. వేరే దేశాల్లో తినే.. డూనట్స్, బర్గర్లు, పిజ్జాలు, శాండ్విచ్ల మీద ఎగబడుతున్నారు.
వాటిని తింటే తిన్నారు కానీ.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. ఫుడ్ రిలేటెడ్ ఎమోజీలు కొడితే అవే ఎమోజీలు కనిపిస్తుంటాయి. అదే డూనట్ ఎమోజీ, బర్గర్ ఎమోజీ, టాకో ఎమోజీ.. మన ఫుడ్ ఎమోజీలు ఎందుకు క్రియేట్ చేయరు. వడపావ్ ఎమోజీ ఎందుకు కనిపించదు.. దోశ ఎమోజీ ఎందుకు కనిపించదు. వడ ఎమోజీ ఎందుకు కనిపించదు.. అనే ఆలోచన వచ్చింది ప్రీతి కిచెన్ అనే ఓ రెస్టారెంట్‌కు.
దీంతో వెంటనే చేంజ్.ఓఆర్జీలో పిటిషన్ వేసింది. దేశీ ఫుడ్ ఎమోజీలు కావాలంటూ పిటిషన్లో పేర్కొంది. దీంతో ఆ పిటిషన్‌కు నెటిజన్ల నుంచి పూర్తిగా మద్దతు లభిస్తోంది. చాలామంద నెటిజన్లు.. ఆ పిటిషన్‌పై సైన్ చేసి.. తమకు కూడా దేశీ ఫుడ్ ఎమోజీలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. దీని వల్ల.. భారతదేశ సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు ప్రపంచానికి తెలుస్తాయని చెబుతున్నారు.
I come from an India where we love our food, and are drowning in emotions but won't sign a petition to make their emojis live. Sign the petition today to get your favorite Indian food emojis live.https://t.co/Te1UlVRsoT#preethikitchenappliances #indianfoodemoji #virdas pic.twitter.com/xXtgqvgBAf
— Preethi Kitchen (@preethiIndia) November 20, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Viral Video : ఏడుస్తున్న కోడి.. ఓదార్చిన వ్యక్తి.. నెటిజన్లు ఏమంటున్నారంటే?
తనను తానే పెళ్లి చేసుకుంది.. తర్వాత విడాకులు ఇచ్చుకుంది.. అసలేంటి ఈమె స్టోరీ
Amazon Marijuana Scandal : గంజాయి స్కామ్‌లో బుక్కయిన అమెజాన్.. నెటిజన్ల ఫన్నీ మీమ్స్ వైరల్
బీరు గ్లాస్ ఎలా కిందపడిపోయిందో ఈ వీడియో చూసి చెప్పండి చూద్దాం
ఇదేందయ్యా ఇది.. జీవితంలో ఇటువంటి యాక్సిడెంట్‌ను ఎప్పుడూ చూసి ఉండరు.. వైరల్ వీడియో