మామూలుగా రాజీనామా లెటర్‌ను దేనిమీద రాస్తారు చెప్పండి. ఏదైనా ఏ4 సైజ్ వైట్ పేపర్ మీద లేదా ఏదైనా ఒక వైట్‌గా ఉండే పేపర్ మీద రాస్తారు. దాని మీద సంతకం పెట్టి బాస్‌కు ఇస్తారు. లేదా ఈమెయిల్ చేస్తారు. ఎక్కడైనా ఇదే కదా ప్రాసెస్. కానీ.. ఈ ఉద్యోగి మాత్రం తన రాజీనామా పత్రాన్ని విచిత్రంగా రాశాడు. అంతే కాదండోయ్.. దాన్ని ఏ పేపర్ మీద రాశాడో తెలిస్తే యాక్ అంటారు. ఆ ఉద్యోగి చేసిన నిర్వాకం ఏంటో వివరంగా తెలుసుకుందాం రండి.
లూయిస్ అనే ఉద్యోగి మాత్రం.. తన రాజీనామా పత్రం వెరైటీగా ఉండాలనుకున్నాడు. అందుకే.. ఏకంగా టాయిలెట్ పేపర్ మీద తన రాజీనామా లేఖను రాశాడు. ఈ నెల 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను అని రాసి.. తన బ్యాక్ చూపిస్తున్నట్టుగా డ్రాయింగ్ కూడా వేశాడు. దాన్ని రెడిట్‌లో పోస్ట్ చేసి.. మా బాస్‌కు ఇదే రాజీనామా పత్రాన్ని ఇవాళ ఇవ్వబోతున్నా అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు.
ఇక.. దాన్ని తీసుకెళ్లి బాస్‌కు ఇచ్చాడట. బాస్ కూడా తన క్రియేటివిటీని మెచ్చుకున్నాడట.
నిజానికి అది మంచి ఉద్యోగం. నేను ఆ జాబ్‌లో చాలా ఎంజాయ్ చేశాను.. అంటూ చెప్పుకొచ్చాడు లూయిస్. నెటిజన్లు అయితే ఆ లెటర్‌ను చూసి షాక్ అవుతున్నారు. బాప్రే.. ఇటువంటి రాజీనామా పత్రాన్ని ఇప్పటి వరకు చూడలేదు. ఇలా కూడా ఇస్తారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇలాంటి ప్రశ్నాపత్రాన్ని ఇప్పటి వరకు చూసి ఉండరు.. అందులోని ఓ ప్రశ్న ఏంటో తెలిస్తే ఫిదా అవుతారు
సముద్రగర్భంలో 4000 ఫీట్ల లోతులో నివసించే అరుదైన చేప ఇది.. ఫోటోలు వైరల్
అన్ని సమాధానాలు చెప్పినా.. ‘బాగా లావుగా’ ఉందని జాబ్ ఇంటర్వ్యూలో రిజెక్ట్ చేశారు
డూనట్స్, బర్గర్స్ వద్దు.. వడ, దోశ, వడపావే ముద్దు.. సోషల్ మీడియాలో సరికొత్త ఉద్యమం
Viral Video : ఏడుస్తున్న కోడి.. ఓదార్చిన వ్యక్తి.. నెటిజన్లు ఏమంటున్నారంటే?