డాక్టర్ అంటే అన్ని రకాల జబ్బులకు చికిత్స చేయాలి. కొందరైతే స్పెషలిస్టులు ఉంటారు. ముఖ్యంగా గర్భిణీలకు చికిత్స అందించే డాక్టర్లు అయితే.. గర్భిణీలకు సరైన మెడిసిన్ ఇవ్వాలి. ఎప్పటికప్పుడు స్కానింగ్ చేయాలి. కడుపులో ఉన్న బేబీ పరిస్థితి ఏంటో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. గర్భిణీకి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ ఏమాత్రం ఏమరపాటుతో ఉన్నా.. డెలివరీ సమయంలో తల్లిబిడ్డకు, డెలివరీ తర్వాత పుట్టిన పసికందుకు ఎన్నో సమస్యలు వస్తాయి.
అసలు విషయానికి వస్తే.. తన తల్లికి డెలివరీ చేసి.. తనను ఈ భూమ్మీదికి తీసుకొచ్చిన డాక్టర్‌పై ఓ యువతి కేసు వేసింది. యూకేకు చెందిన 20 ఏళ్ల యువతి ఆ డాక్టర్‌పై దావా వేసింది. తన తల్లి గర్భిణీగా ఉన్నప్పుడు తనకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ వల్ల తనకు ఈ పరిస్థితి ఏర్పడిందని ఫిర్యాదులో పేర్కొంది.
ఈవీ టూంబెస్కు పుట్టగానే అరుదైన వ్యాధి సోకింది. దాని పేరు ipomyelomeningocele. ఈ వ్యాధి వల్ల తన వెన్నుముక పనిచేయదు. తల్లి కడుపులో ఉన్నప్పుడే తన వెన్నుముక వృద్ధి చెందలేదు. దీని వల్ల తను పుట్టాక ఆ సమస్య వల్ల నిటారుగా నిలబడలేక పోయింది. ఇప్పుడు శాశ్వతంగా మంచానికే పరిమితం అయింది.
ప్రెగ్నెన్సీ సమయంలో తన తల్లికి కావాల్సిన మెడిసిన్‌ను ఇవ్వకుండా.. ట్రీట్మెంట్ సరిగ్గా చేయకపోవడం వల్లనే తనకు ఈ పరిస్థితి వచ్చిందని.. అప్పుడు తనకు సరిగ్గా ట్రీట్మెంట్ చేసి ఉంటే ఇప్పుడు తన పరిస్థితి ఇలా ఉండేది కాదని.. అందుకే అతడిపై దావా వేస్తున్నట్టు టూంబెస్ స్పష్టం చేసింది.
ఈ కేసును విచారించిన కోర్టు.. టూంబెస్ సమస్యను తెలుసుకుంది. కానీ ఆ డాక్టర్ మాత్రం ఈవీ ఆరోపణలను కొట్టిపారేశాడు. తను సరిగ్గానే వైద్యం చేశానని.. వెన్నుముక లోపంతో ఈవీ పుట్టడం తన తప్పు కాదని తెలిపాడు. దీనిపై కోర్టు నిర్ణయం కోసం ఈవీ ఎదురుచూస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇలాంటి ప్రశ్నాపత్రాన్ని ఇప్పటి వరకు చూసి ఉండరు.. అందులోని ఓ ప్రశ్న ఏంటో తెలిస్తే ఫిదా అవుతారు
సముద్రగర్భంలో 4000 ఫీట్ల లోతులో నివసించే అరుదైన చేప ఇది.. ఫోటోలు వైరల్
అన్ని సమాధానాలు చెప్పినా.. ‘బాగా లావుగా’ ఉందని జాబ్ ఇంటర్వ్యూలో రిజెక్ట్ చేశారు
డూనట్స్, బర్గర్స్ వద్దు.. వడ, దోశ, వడపావే ముద్దు.. సోషల్ మీడియాలో సరికొత్త ఉద్యమం