సాధారణంగా కార్మిక చట్టం ప్రకారం.. వారంలో ఒక రోజు ఉద్యోగులకు సెలవు ఇస్తారు. ఐటీ కంపెనీలు అయితే వారానికి రెండు రోజులు సెలవులు ఇస్తాయి. కానీ.. వారానికి మూడు రోజులు సెలవులు ఇచ్చి.. కేవలం నాలుగు రోజులే పని చేయించుకునే కంపెనీలను చూశారా? ఇప్పటి వరకు చూసి ఉండరు కదా. కానీ.. ఓ బ్యాంకు మాత్రం వారానికి నాలుగు రోజులే పని అంటూ ప్రకటించింది. అందరు ఉద్యోగులకు ఈ రూల్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగులు ఫుల్ ఖుషీ అయ్యారు.
బ్రిటన్‌కు చెందిన ఆటమ్ బ్యాంక్(Atom Bank) ఈ ఆఫర్‌ను తమ ఉద్యోగులకు అందించింది. ఉద్యోగుల జీతాలు కట్ చేయకుండా.. వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిచేయించుకుంటామని కంపెనీ స్పష్టం చేసింది. ఈ పాలసీని నవంబర్ 1, 2021 నుంచే అమలు చేస్తున్నట్టు ప్రకటించింది.
ఉద్యోగుల శ్రేయస్సు కోసమే ఈ పాలసీని తీసుకొచ్చినట్టు బ్యాంక్ సీఈవో మార్క్ ముల్లెన్ వెల్లడించారు. సాధారణంగా వారానికి ఉద్యోగులు 37.5 గంటలు పనిచేస్తారు. కొత్తగా తీసుకొచ్చిన ఈ పాలసీ వల్ల.. ఉద్యోగులు వారానికి 34 గంటలు మాత్రమే పనిచేస్తారు. అయితే.. వారానికి నాలుగు రోజుల పని పాలసీ అనేది ఆప్షనల్. ఉద్యోగులకు నచ్చితేనే ఈ పాలసీని ఎంచుకోవచ్చు. ఈ పాలసీని ఎంచుకుంటే.. ఇంకొంచెం ఎక్కువ సమయం పనిచేయాల్సి ఉంటుంది.. అని సీఈవో స్పష్టం చేశారు.
అన్ని కంపెనీలకు 4 రోజుల పని దినాలు అనేవి సెట్ కావు. కానీ.. మా బ్యాంక్ తీసుకొచ్చిన ఈ కొత్త పాలసీ వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుందని ఆశిస్తున్నాం.. అని ఆయన అన్నారు.
కొత్త పాలసీ అందుబాటులోకి రాగానే.. ఆటమ్ బ్యాంక్‌కు చెందిన 430 మంది ఉద్యోగులు వెంటనే కొత్త పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చాలామంది ఉద్యోగులు సోమవారం కానీ లేదంటే శుక్రవారం కానీ సెలవులు తీసుకోనున్నారు. ఆపరేషనల్, సర్వీస్ రోల్స్‌లో పనిచేసే వాళ్లకు మిగితా రోజుల్లో సెలవులు ఉంటాయి.
ఇదివరకు అంటే 9 టు 5 జాబ్, మండే టు ఫ్రైడే అంటూ గిరి గీసుకొని పని చేసేవాళ్లం. ఇప్పుడు అలా కాదు.. కోవిడ్ వల్ల అన్నీ మారిపోయాయి. 9 టు 5 పోయింది. మండే టు ఫ్రైడే పోయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల చాలా కంపెనీలు తమ ప్రొడక్టివిటీని పెంచుకున్నాయి.. ఉద్యోగులకు పని చేసే సౌకర్యాన్ని ఎంత మెరుగుపరిస్తే.. వాళ్లు అంతగా రాణిస్తారు.. అని మార్క్ ముల్లెన్ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
తల్లికి డెలివరీ చేసి తన పుట్టుకకు కారణం అయిన డాక్టర్‌పై కేసు పెట్టిన యువతి
అన్ని సమాధానాలు చెప్పినా.. ‘బాగా లావుగా’ ఉందని జాబ్ ఇంటర్వ్యూలో రిజెక్ట్ చేశారు
అర్ధరాత్రైనా ఇక్కడ పగల్లాగే ఉంటుంది.. సూర్యుడు అస్తమించని ప్రాంతాలివే..
ఆ కొలతలు ఉన్న అమ్మాయే కావాలి.. మ్యాట్రిమోనిలో ప్రకటన
తనను తానే పెళ్లి చేసుకుంది.. తర్వాత విడాకులు ఇచ్చుకుంది.. అసలేంటి ఈమె స్టోరీ