ఆ కొలతలు ఉన్న అమ్మాయే కావాలి.. మ్యాట్రిమోనిలో ప్రకటన
Matrimonial Ad | ఏ యువకుడైనా అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కలలు కంటాడు. మంచి హైట్, మంచి అందం, మంచి కలర్, మంచి నవ్వు నవ్వే అమ్మాయి అయితే బాగుండని ఊహాల్లో తేలియాడుతుంటారు. అప్సరస లాంటి అమ్మాయి

ఏ యువకుడైనా అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కలలు కంటాడు. మంచి హైట్, మంచి అందం, మంచి కలర్, మంచి నవ్వు నవ్వే అమ్మాయి అయితే బాగుండని ఊహాల్లో తేలియాడుతుంటారు. అప్సరస లాంటి అమ్మాయి కోసమే ప్రతి ఒక్కరూ అన్వేషిస్తుంటారు. అవసరమనుకుంటే మ్యాట్రిమోనిని కూడా సంప్రదిస్తారు. పైలక్షణాలు కావాలనుకోవడంలో తప్పేం లేదు. కానీ ఓ యువకుడు మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించాడు. తాను పెళ్లి చేసుకునే అమ్మాయికి ప్రత్యేక సైజులు ఉండాలని కోరుకున్నాడు. ఆ సైజులు ఉంటేనే పెళ్లాడుతానని ఓ మ్యాట్రిమోని వెబ్సైట్లో పేర్కొన్నాడు.
ఆ యువకుడికి కావాల్సిన ప్రత్యేకతలు ఏంటంటే.. సదరు యువతి స్లిమ్‌గా, ఫేర్‌గా ఉండటంతో పాటు పొడవుగా ఉండాలి. 5’2 నుంచి 5’6 మధ్య హైట్ ఉండాలి. 32b నుంచి 32c సైజు బ్రా ధరించాలి. నడుము 12 నుంచి 16 ఇంచులు ఉండాలి. పాదాలు 6 నుంచి 7 ఇంచులు ఉండాలి అని నమోదు చేశాడు. యువతి వయసు 18 ఏండ్లకు పైబడి, 26 ఏండ్లకు మించి ఉండరాదని పేర్కొన్నాడు. బెడ్ టైమ్‌లో క్యాస్టూమ్స్ ధరించాలి. ఇక పిల్లలను ప్రేమించాల్సిన అవసరం లేదు. కుక్కలను మాత్రం కచ్చితంగా ప్రేమించాలని కండిషన్ పెట్టాడు. 80 శాతం క్యాజువల్‌గా, 20 శాతం ఫార్మల్గా ఉండాలని ఆ యువకుడు పేర్కొన్నాడు. ఈ వివరాలన్నీ Betterhalf.ai అనే మ్యాట్రిమోని వెబ్సైట్లో పొందుపరిచాడు.

అయితే ప్రస్తుతం ఈ ప్రకటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. వీడు అసలు మనిషా.. లేక కామంతో రగిలిపోతున్న మృగమా.. లేక ఇంకేదైనా తేడానా? అని నెటిజన్లు ప్రశ్నించుకుంటున్నారు. లేడిస్ టైలర్ అయి ఉండొచ్చని కొందరు జోకులు పేలుస్తున్నారు. పార్ట్నర్ కోసం వెతికినట్టు లేదు.. యువతులను కించపరిచేలా ప్రకటన ఉందన్నారు. ఇలాంటి వాడి కోసం ఓ బార్బీ డాల్ ఇస్తే సరిపోతుందన్నారు.
అమ్మాయిలను కించపరిచేలా ప్రకటన ఇచ్చిన యువకుడిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని Betterhalf.ai మ్యాట్రిమోని వెబ్సైట్ స్పష్టం చేసింది. మ్యాట్రిమోని ప్రకటనలకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించాడని ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

