ఎల్జీబీటీక్యూ(LGBTQ).. అంటే తెలుసు కదా.. అందులో మొదటి అక్షరం ఎల్.. అంటే లెస్బియన్. మహిళలపై మహిళలకు ఆకర్షణ ఏర్పడటం.. ప్రేమ ఏర్పడటం.. వాళ్లతోనే కలిసి ఉండాలని అనుకోవడం.. పురుషులపై ఎటువంటి ఫీలింగ్స్ కలగకపోతే వాళ్లను లెస్బియన్స్ అంటారు. ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా ఈ కల్చర్ విపరీతంగా పెరుగుతోంది. మన దేశంలో కూడా ఈ కల్చర్ ఇప్పుడిప్పుడే వస్తోంది.
అయితే.. లెస్బియన్స్ అంటే చిన్నచూపు చూడకూడదని.. వాళ్లకూ ఓ మనసు ఉంటుందని.. కుటుంబ సభ్యులు కూడా వాళ్లను అర్థం చేసుకోవాలి.. అనే నేపథ్యంలో తమిళంలో తొలిసారి లెస్బియన్ల మీద ఓ వీడియో రిలీజ్ అయింది. ఆ వీడియో యూట్యూబ్లో రిలీజ్ అయి ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది.
నెటిజన్లు ఆ వీడియోను చూసి.. భావోద్వేగానికి గురవుతున్నారు. సూపర్బ్ లవ్ స్టోరీ, తమిళ్ ఇండస్ట్రీకి ముందు హ్యాట్సాఫ్ చెప్పాలి. అంత సెన్సిటివ్ టాపిక్ అయినా కూడా దాన్ని ఆలోచనాత్మకంగా వీడియోగా రూపొందించారు.. అంటూ నెటిజన్లు ఆ వీడియోపై ప్రశంసలజల్లు కురిపిస్తున్నారు. Magizhini అనే పేరుతో యూట్యూబ్లో వీడియోను అప్లోడ్ చేశారు. వీడియోను అప్లోడ్ చేసిన నాలుగు రోజులకే 20 లక్షల వ్యూస్ వచ్చాయి. సోషల్ మీడియాతో పాటు.. తమిళ్ ఇండస్ట్రీలో, తమిళ ప్రజల్లో ఈ వీడియో గురించే చర్చ. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియోను చూసేయండి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Belly Dance : ‘మనికె మగె హితే’ పాటకు బెల్లీ డ్యాన్స్ చేసి అదరగొట్టేసింది.. వీడియో వైరల్
అక్కడ వారానికి నాలుగు రోజులే పని.. జీతం కూడా కట్ చేయరు
ఫోన్లకు చార్జింగ్ పెట్టుకుంటే జీతం కట్.. ఉద్యోగులకు బాస్ అల్టిమేటం
Prakash Raj : ఆకాశాన్నంటిన టమాటా ధరలు.. ప్రకాశ్ రాజ్ షేర్ చేసిన మీమ్ వైరల్
ఈ పిల్లాడి ముందు స్టార్ హోటల్ చెఫ్ కూడా పనికిరాడు.. వైరల్ వీడియో