నడవడం ఇష్టం లేక అంబులెన్స్‌కు ఫోన్.. 39 సార్లు ఫ్రీ ట్యాక్సీలా వాడుకున్నాడు
నడవడం ఇష్టం లేక అంబులెన్స్‌కు ఫోన్ | సాధారణంగా అంబులెన్స్ సర్వీసులను ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితుల్లోనే వాడుకోవాలి. యాక్సిడెంట్ అయినా లేదా ఎవరికైనా రోడ్డు మీద ఆరోగ్యం
సాధారణంగా అంబులెన్స్ సర్వీసులను ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితుల్లోనే వాడుకోవాలి. యాక్సిడెంట్ అయినా.. లేదా ఎవరికైనా రోడ్డు మీద ఆరోగ్యం బాగాలేకపోయినా.. ప్రమాద సమయాల్లో అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్లేందుకు మాత్రమే అంబులెన్స్ సర్వీసులను ఉపయోగించుకోవాలి.

కానీ.. ఓ వ్యక్తి మాత్రం తన స్వార్థం కోసం.. నడవడం ఇష్టం లేక.. బద్ధకంతో అంబులెన్స్ సర్వీసును ఉపయోగించుకున్నాడు. ఒకసారి కాదు.. రెండు సార్లు కాదే.. ఏకంగా ఒక సంవత్సరంలో 39 సార్లు అంబులెన్స్ సర్వీసును ఉచితంగా ఉపయోగించుకున్నాడు.
తైవాన్‌కు చెందిన ఓ వ్యక్తి సరుకుల కోసం సూపర్ మార్కెట్‌కు వెళ్లినప్పుడు.. ట్యాక్సీ బుక్ చేసుకొని వెళ్లడం ఎందుకు డబ్బులు దండగ అని అనుకున్నాడో ఏమో.. వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి తనకు అస్వస్థతగా ఉందని చెప్పి.. దాంట్లో ఫ్రీగా ప్రయాణం చేసేవాడు. తను చెప్పిన ఆసుపత్రికి తీసుకెళ్లాలని అంబులెన్స్ సిబ్బందిని కోరేవాడు. ఎందుకంటే.. తను చెప్పిన ఆసుపత్రి పక్కనే అతడి ఇల్లు కాబట్టి. అంబులెన్స్ ఆసుపత్రిలో అతడిని దింపగానే అక్కడి నుంచి తన ఇంటికి వెళ్లిపోయేవాడు.
మీకు ఇంకో విషయం తెలుసా? సూపర్ మార్కెట్ నుంచి తన ఇంటికి మధ్య దూరం ఎంతో తెలుసా? కేవలం 200 మీటర్లు అంటే కనీసం అర కిలోమీటర్ కూడా కాదు. అయినప్పటికీ.. ఫ్రీ ట్యాక్సీలా అంబులెన్స్‌ను 39 సార్లు వాడుకున్నాడు.
అయితే.. చాలాసార్లు అంబులెన్స్‌లో వచ్చి చెకప్ చేయించుకోకుండా వెళ్లిపోతున్న అతడిపై హాస్పిటల్ సిబ్బందికి అనుమానం కలిగింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అతడి అసలు గుట్టును బయటపెట్టారు. అతడికి వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. ఇంకోసారి అలా చేస్తే జైలులో ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
నచ్చిన ఫుడ్ తినడం కోసం 8000 రెస్టారెంట్లు తిరిగాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Magizhini : అదరగొడుతున్న లెస్బియన్ సాంగ్.. తమిళంలో రిలీజ్ అయిన ఫస్ట్ వీడియో వైరల్
Belly Dance : ‘మనికె మగె హితే’ పాటకు బెల్లీ డ్యాన్స్ చేసి అదరగొట్టేసింది.. వీడియో వైరల్
అక్కడ వారానికి నాలుగు రోజులే పని.. జీతం కూడా కట్ చేయరు
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

