10 మంది తినే ఫుడ్‌ను ఒక్కడే తినగలడా? అసాధ్యం కదా. కానీ.. దాన్ని సాధ్యం చేసి చూపించాడు ఓ వ్యక్తి. అది కూడా కేవలం 24 నిమిషాల్లో మొత్తం తిని బ్రేవ్ అన్నాడు. 10 మంది ఆ ఫుడ్‌ను కడుపు నిండా తిన్నా కూడా ఇంకా కొంత మిగిలి ఉండే ఫుడ్డును ఒక్కటే లాగించేయడం అంటే మామూలు విషయం కాదు.
అయితే.. ఇదంతా తన యూట్యూబ్ చానెల్ వీడియో కోసం చేసిన స్టంట్. ప్రస్తుతం క్రిస్మస్ సెలబ్రేషన్స్ ప్రారంభం అయ్యాయి కదా. దీంతో పలు రెస్టారెంట్లలో క్రిస్మస్ స్పెషల్ ఫుడ్‌ను అమ్ముతున్నారు.
మెక్ డొనాల్డ్స్‌లో కూడా క్రిస్మస్ మీల్లో భాగంగా 6 బర్గర్లు, 2 చీజ్ షేర్ బాక్సెస్, 8 ఫెస్టివ్ పైస్, 2 మెక్ ఫ్లర్రీస్ను అందిస్తున్నారు. కనీసం 10 మంది అయితేనే వాటిని తినగలరు. కానీ.. యూకేకు చెందిన ఫేమస్ యూట్యూబర్ కైల్ గిబ్సన్.. ఒక్కడే 24 నిమిషాల్లో ఆ ఫుడ్ మొత్తాన్ని తినేసి రికార్డు క్రియేట్ చేశాడు. ఆ ఫుడ్ అంతా కలిస్తే 9600 కేలరీలు ఉంటుంది. అన్ని కేలరీల ఫుడ్‌ను ఒకేసారి తిని అరిగించుకోవడం అంటే సాహసం అనే చెప్పాలి. ఆ ఫుడ్ తింటూ వీడియో షూట్ చేసి.. దాన్ని తన యూట్యూబ్ చానెల్లో షేర్ చేశాడు కైల్. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వామ్మో.. వీడు మనిషేనా.. అంత ఫుడ్ ఒకేసారి ఎలా తిన్నావు సామీ అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది మాంసం అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. మరేంటో చెప్పుకోండి చూద్దాం
అత్యంత బిగ్గరగా త్రేన్పు తీసి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కాడు.. వైరల్ వీడియో
సెలూన్‌కు వెళ్లి గడ్డం గీయించుకున్న కోతి.. షాకైన కస్టమర్లు.. వైరల్ వీడియో
ఇంటికి క్రిస్మస్ లైట్స్ డెకరేట్ చేశారని రూ.75 వేల ఫైన్ వేశారు.. అసలు కారణం ఏంటో తెలుసా?
Rare Coin : వేలంలో కోట్లు పలికిన అరుదైన నాణెం.. ఎంతకు అమ్ముడు పోయిందో తెలుసా?