ఎహె.. ఊరుకోండి.. కోతి ఏంటి.. సెలూన్‌కు వెళ్లి గడ్డం గీయించుకోవడం ఏంటి.. జోక్ కాకపోతే అంటారా? నిజం అండి బాబు.. ఓ కోతి సెలూన్‌కు వెళ్లి.. కుర్చీలో కూర్చొని మరీ.. గడ్డం గీయించుకుంది. బార్బర్ కూడా కిక్కుమనకుండా.. దానికి గడ్డం గీశాడు. ట్రిమ్మర్‌తో దానికి గడ్డం తీశాడు. లేకపోతే అది ఎక్కడ మీద పడి రక్కేస్తుందోనని భయపడ్డాడు.
ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. కోతి గడ్డం గీయించుకునే వీడియోను ఐపీఎస్ ఆఫీసర్ రుపిన్ శర్మ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశాడు. గడ్డం గీయించుకున్నాక స్మార్ట్‌గా కనిపిస్తున్నావు.. అనే క్యాప్షన్ పెట్టి ఆ వీడియోను షేర్ చేశాడు శర్మ.
దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోతి.. గడ్డం గీయించుకుంటుంటే.. సెలూన్‌కు వచ్చిన కస్టమర్లు విచిత్రంగా చూశారు. కొందరైతే షాక్ అయ్యారు.. ఆశ్చర్యపోయారు. మరికొందరు తమ ఫోన్లలో కోతి గడ్డం గీయించుకునే దృశ్యాన్ని బంధించారు. నెటిజన్లు అయితే ఆ వీడియో చూసి నవ్వు ఆపుకోలేకపోతున్నారు. భలే కోతి.. ఇప్పుడు బాగున్నావు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
अब लग रहे SMART☺️☺️☺️👌👌👌
— Rupin Sharma (@rupin1992) November 29, 2021
BEAUTY_PARLOUR☺️☺️😊@ParveenKaswan @susantananda3 @SudhaRamenIFS @NaveedIRS @arunbothra @TheJohnAbraham pic.twitter.com/lCiy0tmqN0
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇంటికి క్రిస్మస్ లైట్స్ డెకరేట్ చేశారని రూ.75 వేల ఫైన్ వేశారు.. అసలు కారణం ఏంటో తెలుసా?
Rare Coin : వేలంలో కోట్లు పలికిన అరుదైన నాణెం.. ఎంతకు అమ్ముడు పోయిందో తెలుసా?
గెస్ట్‌ల ముందు కొత్తగా ట్రై చేయబోయిన నూతన వధూవరులు.. అడ్డంగా బుక్కయ్యారు.. వైరల్ వీడియో
ఓవైపు పెళ్లిమండపం కాలిపోతుంటే.. తాపీగా కూర్చొని భోజనం చేసిన అతిథులు.. వైరల్ వీడియో
Mehendi Blouse : చీర కట్టింది కానీ నో జాకెట్.. మెహందీతో బ్లౌజ్ డిజైన్.. నెటిజన్లు చూసి షాక్