కాంగ్రెస్ ఏజెంట్‌గా ఉన్న సీఐని సస్పెండ్ చేయాలి
ఖాకీ చొక్కను ధరించి విధులను విస్మరించి అధికారపార్టీకి ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న ఆత్మకూర్ సీఐ శివకుమార్‌ను తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేయాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన అమరచింత మున్సిపల్ కార్యాలయం సమీపంలో వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్రావుతో మాట్లాడుతూ సీఐ శివకుమార్ ఎన్నికల నిబంధలను తుంగ లో తొక్కి బీఆర్ఎస్ కౌన్సిలర్లతో బయటి వ్యక్తుల నుంచి ఫోన్ మాట్లాడించడం ఏమిటని ప్రశ్నించారు.
- మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
అమరచింత, ఫిబ్రవరి 16: ఖాకీ చొక్కను ధరించి విధులను విస్మరించి అధికారపార్టీకి ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న ఆత్మకూర్ సీఐ శివకుమార్‌ను తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేయాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన అమరచింత మున్సిపల్ కార్యాలయం సమీపంలో వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్రావుతో మాట్లాడుతూ సీఐ శివకుమార్ ఎన్నికల నిబంధలను తుంగ లో తొక్కి బీఆర్ఎస్ కౌన్సిలర్లతో బయటి వ్యక్తుల నుంచి ఫోన్ మాట్లాడించడం ఏమిటని ప్రశ్నించారు.
ఎన్నికల అధికారి మున్సిపల్ చైర్మన్ ఎంపిక చేసే సమయంలో సీఐ శివకుమార్ మున్సిపల్ ఉద్యోగిని సాయంతో బీఆర్ఎస్ కౌన్సిలర్ జింక సువర్ణను బయటకు పిలిపించడంతో కాంగ్రెస్ నాయకులు ప్రలోభాలకు గురిచేసి కాంగ్రెస్ తరఫున ఆమెనే చైర్‌పర్సన్‌గా ఎంపిక చేశారని మండిపడ్డారు. ఈ కుట్ర వెనుక సీఐ హస్తం ఉందని, మొదటి నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే అభ్యర్థులను కాంగ్రెస్ తరపున పోటీ చేయాలని బెదిరింపులకు పాల్పడాడని, సీఐ తన ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్‌పార్టీలో చేరాలని సూచించారు. లేదంటే మంత్రి వాకిటి శ్రీహరి మీద అంతగా ప్రేమగా ఆయన వెంట ఉండి పనిచేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రలోభాలకు గురిచేసి కాంగ్రెస్ పార్టీ అడ్డదారిలో చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకోవడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రికత్త వాతావరణం నెలకొన్నది. డీఎస్సీ వెంకటేశ్వర్రావు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించిన పలువురు సీఐలు, ఎస్సైలు తమ సిబ్బందితో ఇరువర్గాలను చెదరగొట్టారు. ప్రశాంత వాతావరణంలో జరగాల్సిన చైర్మన్ ఎంపికలో అధికారపార్టీకి వత్తాసు పలికి గొడవలు జరగడానికి కారణమైన సీఐ శివకుమార్‌పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మె ల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన వెంట పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

