కొందరు అయితే అస్తమానం అదే పనిగా త్రేన్పులు తీస్తుంటారు. తిన్నా తినకపోయినా.. బ్రేవ్మంటుంటారు. కొందరు ఫుల్లుగా మెక్కాక కానీ.. బ్రేవ్మనరు. ఏది ఏమైనా.. త్రేన్పు అనేది ప్రతిఒక్కరు చేసే పనే. అయితే.. కొందరు మెల్లగా, నెమ్మదిగా త్రేన్పులు తీస్తుంటారు. మరికొందరు కాస్త గట్టిగానే త్రేన్పు తీస్తారు. ఇంకొందరు అయితే.. త్రేన్పు తీస్తే పక్కింటికి కూడా వినిపిస్తుంది.
కానీ.. ఈ వ్యక్తి తీసిన త్రేన్పు మాత్రం ప్రపంచంలోనే అత్యంత బిగ్గరగా తీసిన త్రేన్పు అట. అలాంటి అరుదైన ఫీట్‌ను సాధించినందుకు అతడి పేరును గిన్నిస్ వరల్డ్ రికార్డులోనూ ఎక్కించారు.
12 ఏళ్ల క్రితం యూకేకు చెందిన పాల్ హన్ రికార్డును తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన నెవిల్లే షార్ప్ బ్రేక్ చేసి.. అత్యంత బిగ్గరగా త్రేన్పు తీసిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు.
మనోడు తీసిన ఆ త్రేన్పును డివైజ్‌లో రికార్డు చేస్తే అది 112.4 డెసిబుల్స్‌గా రికార్డు అయింది. దీంతో అతడి ఆనందానికి హద్దులు లేవు. ఆ సౌండ్.. ఒక ఎలక్ట్రిక్ డ్రిల్ చేసేంతగా ఉంటుందట.
ఇక.. ఆ వ్యక్తి తీసిన త్రేన్పునకు సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్ట్ ప్రతినిథులు.. తమ ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
NEW: The record for the loudest burp has been beaten for the first time in over 10 years 🌝 pic.twitter.com/b9rqVBog7T
— Guinness World Records (@GWR) November 30, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సెలూన్‌కు వెళ్లి గడ్డం గీయించుకున్న కోతి.. షాకైన కస్టమర్లు.. వైరల్ వీడియో
ఇంటికి క్రిస్మస్ లైట్స్ డెకరేట్ చేశారని రూ.75 వేల ఫైన్ వేశారు.. అసలు కారణం ఏంటో తెలుసా?
Rare Coin : వేలంలో కోట్లు పలికిన అరుదైన నాణెం.. ఎంతకు అమ్ముడు పోయిందో తెలుసా?
గెస్ట్‌ల ముందు కొత్తగా ట్రై చేయబోయిన నూతన వధూవరులు.. అడ్డంగా బుక్కయ్యారు.. వైరల్ వీడియో
ఓవైపు పెళ్లిమండపం కాలిపోతుంటే.. తాపీగా కూర్చొని భోజనం చేసిన అతిథులు.. వైరల్ వీడియో
Mehendi Blouse : చీర కట్టింది కానీ నో జాకెట్.. మెహందీతో బ్లౌజ్ డిజైన్.. నెటిజన్లు చూసి షాక్