సింహం ఎప్పటికైనా సింహమే. అది అడవికి రాజే. ఎక్కడున్నా అది రాజులాగానే బతుకుతుంది. తాజాగా అది టూరిస్టులు ఉన్న ఓ సఫారీ జీపుపై అటాక్ చేయబోయిన ఓ సింహం ఏం చేసిందో చూస్తే ఆశ్చర్యపోతారు.
సౌతాఫ్రికాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టూరిస్టులతో ఉన్న సఫారీ జీపు వెళ్తుండగా.. సింహం చూసింది. అయితే.. అప్పటికే ఆ జీపు ఇసుకలో చిక్కుకుపోగా.. టూర్ గైడ్.. ఒక తాడు వేసి దాన్ని రోడ్డు మీదికి లాగేందుకు ప్రయత్నాలు చేశాడు. ఇంతలో సింహం వచ్చింది. దీంతో అందరూ వాహనం ఎక్కారు. ఆ సింహం.. సఫారీ జీపుపై అటాక్ చేయబోయి.. అక్కడ కనిపించిన తాడును పట్టుకొని లాగింది. ఇంతలోనే వాహనం స్టార్ట్ అయి ముందుకు కదలడంతో ఆ తాడుతో పాటు సింహం కూడా కొద్ది దూరం ముందుకు వెళ్లింది.
అయినా కూడా ఆ సింహం ఆ తాడును వదల్లేదు. టగ్ ఆఫ్ వార్ ఆడింది సఫారీతో. ఈ ఘటనను సఫారీలో ఉన్న టూరిస్టులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో నెటిజన్లకు తెగ నచ్చేసింది. నెటిజన్లు ఆ వీడియోను చూసి ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. క్యాట్ విల్ బి క్యాట్ అంటూ కామెంట్లు చేసి వీడియోను వైరల్ చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
చివరి నిమిషంలో ఫుడ్ ఆర్డర్ చేశాడు.. రెస్టారెంట్ ఏం డెలివరీ చేసిందో తెలుసా?
జాబ్ కావాలి.. మెట్రో స్టేషన్ వద్ద రెజ్యూమ్‌తో నిరుద్యోగి.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?
పురిటి నొప్పులు వస్తున్నా.. సైకిల్ తొక్కుతూ ఆసుపత్రికి వెళ్లి బిడ్డకు జన్మనిచ్చిన ఎంపీ
Monkey Festival : అక్కడ కోతుల పండుగే స్పెషల్ అట్రాక్షన్.. ఎందుకు జరుపుతారో తెలుసా?