Monkey Festival : అక్కడ కోతుల పండుగే స్పెషల్ అట్రాక్షన్.. ఎందుకు జరుపుతారో తెలుసా?
అక్కడ కోతుల పండుగే స్పెషల్ అట్రాక్షన్ | ప్రస్తుతం ఎక్కడ చూసినా కోతులే. గుంపులు గుంపులుగా కోతులు ఊళ్లలోకి దూసుకొస్తున్నాయి. పొలాల్లోనూ హల్చల్ చేస్తున్నాయి.

ప్రస్తుతం ఎక్కడ చూసినా కోతులే. గుంపులు గుంపులుగా కోతులు ఊళ్లలోకి దూసుకొస్తున్నాయి. పొలాల్లోనూ హల్చల్ చేస్తున్నాయి. కోతులు కనిపిస్తే చాలు.. కర్ర పట్టుకొని వాటిని గెదమడమే. కానీ.. ఓ చోట కోతుల పండుగను నిర్వహిస్తారు తెలుసా? వాటి పండుగ రోజులు గుంపులు గుంపులుగా కొన్ని వేల కోతులు అక్కడికి చేరుకుంటాయి. వాటికి కావాల్సిన అన్ని ఆహార పదార్థాలను అందిస్తారు. వాటిని చూడటానికి వేల మంది టూరిస్టులు కూడా అక్కడికి చేరుకుంటారు. ఇంతకీ ఆ కోతుల పండుగ(Monkey Festival) స్పెషాలిటీ ఏంటి? ఎందుకు జరుపుకుంటారో కాస్త వివరంగా తెలుసుకుందాం రండి.
థాయిలాండ్‌లోని లోప్‌బురి అనే ప్రాంతంలోనే ఈ మంకీ ఫెస్టివల్ జరిగేది. ఈ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం నవంబర్ చివరి వారంలో జరుగుతుంది. కానీ.. గత రెండేళ్ల నుంచి కరోనా వల్ల ఆ ఫెస్టివల్ ఆగిపోయింది. తిరిగి రెండేళ్ల తర్వాత ఆ ఫెస్టివల్‌ను పునఃప్రారంభించారు.

ఈ ఫెస్టివల్ సందర్భంగా.. కోతుల కోసం రెండు టన్నుల పండ్లు, కూరగాయలను అక్కడికి తరలించారు. ఆ ప్రాంతానికి రకరకాల జాతులకు చెందిన కోతులు వస్తాయట. వాటిని చూడటం కోసమే టూరిస్టులు కూడా క్యూ కడుతుంటారు. అక్కడికి వచ్చిన టూరిస్టులు వేసే ఆహారాన్ని తింటూ టూరిస్టుల మీద ఎక్కుతూ అవి సరదాగా గడుపుతాయి. అక్కడి స్థానికులకు కోతుల పండుగ అనేది వాళ్ల సంప్రదాయం.
ఈ ఫెస్టివల్‌ను అక్కడి ఊరి పెద్ద యోంగ్యుత్ కిత్వాటానాసోంత్ నిర్వహిస్తారు. అయితే.. ఈ ఫెస్టివల్ నిర్వహించడం వెనుక పెద్ద కారణం కూడా ఉంది. ప్రతి సంవత్సరం ఒక థీమ్‌తో ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తారు. ఈసారి వీల్‌చైర్ మంకీస్ అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. అంటే.. అక్కడ అవసరం ఉన్న వాళ్లకు 100 వీల్చైర్లను ఉచితంగా అందిస్తారు అన్నమాట.

ఈ ఫెస్టివల్ కోసమే థాయిలాండ్ ప్రభుత్వం వాక్సినేషన్ వేసుకున్న టూరిస్టులకు క్వారంటైన్ లేకుండానే అనుమతి ఇస్తుండటంతో.. ఈ ఫెస్టివల్‌ను చూసేందుకు టూరిస్టులు ఎగబడుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ప్రపంచ పర్యాటక గ్రామం.. పోచంపల్లి!
ఇప్పటికీ ఎయిర్‌పోర్ట్‌లు లేని దేశాలు ఉన్నాయని తెలుసా?
నచ్చిన ఫుడ్ తినడం కోసం 8000 రెస్టారెంట్లు తిరిగాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
30 ఏళ్లపాటు నీటిలో ఉన్న గ్రామం.. ఇప్పుడు బయటపడింది!
శత్రువులను అడ్డుకోవాలన్న తపనలో.. పొరపాటున వాళ్ల దేశంలోనే కోట కట్టారు
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

