30 ఏళ్లపాటు నీటిలో ఉన్న గ్రామం.. ఇప్పుడు బయటపడింది!
Underwater Village | 30 ఏళ్లు నీళ్లలో మునిగి ఉన్న ఆ గ్రామం ఇప్పుడు బయటపడింది. కూలి పోయిన పైకప్పులు, తుప్పుపట్టిన గేట్లు.. ఇవే ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న దృశ్యాలు.

Underwater Village | 30 ఏళ్లు నీళ్లలో మునిగి ఉన్న ఆ గ్రామం ఇప్పుడు బయటపడింది. కూలి పోయిన పైకప్పులు, తుప్పుపట్టిన గేట్లు.. ఇవే ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న దృశ్యాలు. ముప్పై సంవత్సరాలు తర్వాత బయటపడిన ఈ గ్రామం పేరు అసెరెడో. స్పెయిన్లో ఉన్న ఈ గ్రామాన్ని 1992లో ఖాళీ చేసేశారు.
పోర్చుగీస్ హైడ్రోఎలెక్ట్రిక్ ప్లాంట్ రిజర్వాయర్ కట్టడంతో నీటి నిల్వ కోసం ఈ గ్రామాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. ఈ రిజర్వాయర్ గేట్లు మూసేసిన తర్వాత అసెరెడో గ్రామం జలగర్భంలో కలిసిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు రిజర్వాయర్లో నీటి నిల్వలు తగ్గడంతో ఇలా బయటపడింది.
అసెరెడోనే కాదు అప్పట్లో ఈ రిజర్వాయర్లో నీటి నిల్వ కోసం ఓ బావో, బుస్కాల్కూ, ఏ రెలోయిరా, లాంటెమిల్ గ్రామాలు కూడా నీట మునిగిపోయాయి. ఇన్నేళ్ల తర్వాత అసెరెడో గ్రామం బయటపడటంతో.. మళ్లీ ఇలాంటి ఛాన్స్ దొరుకుతుందో లేదో అని స్థానికులు ఇక్కడి దృశ్యాలు చూసేందుకు తరలివస్తున్నారు.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

