అమితాబ్ బచ్చన్ వాటర్‌ఫాల్స్ పేరు విన్నారా ఎప్పుడైనా? అదేంటి.. అమితాబ్ బచ్చన్‌కు వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయా? అని నోరెళ్లబెట్టకండి. ఆ వాటర్ ఫాల్స్ అమితాబ్ బచ్చన్వి కావు.. అభిషేక్ బచ్చన్వి కావు.. ఆ వాటర్ఫాల్కు ఆయన పేరు పెట్టారు అంతే. సాధారణంగా వాటర్‌ఫాల్స్‌కు ఏదో ఒక పేరు పెడుతుంటారు కదా.. ఈ వాటర్ఫాల్కు బిగ్‌బి అమితాబ్ బచ్చన్ పేరు పెట్టారు.
ఇంతకీ ఆ వాటర్ఫాల్కు బిగ్ బి పేరు ఎందుకు పెట్టారు? ఆ వాటర్ ఫాల్ ఎక్కడ ఉంది? అని అంటారా? అమితాబ్ బచ్చన్ అనగానే మనకు గుర్తొచ్చేది పొడవు. అవును.. ఆయన 6 అడుగుల కంటే ఎక్కువ పొడవు అంటారు. ఆ వాటర్ ఫాల్ కూడా చాలా హైట్ ఉంది. మిగితా వాటర్‌ఫాల్స్ కంటే కూడా చాలా ఎత్తులో ఉంటుంది కాబట్టే దానికి అమితాబ్ బచ్చన్ వాటర్ ఫాల్ అనే పేరు పెట్టారు.
ఇంతకీ ఈ వాటర్‌ఫాల్ ఎక్కడుంది అంటారా? దాన్ని సందర్శించాలంటే మనం నార్త్ ఈస్ట్‌కు వెళ్లాల్సిందే. సిక్కింలో ఉంది ఈ వాటర్ ఫాల్. చుంగ్తాంగ్ నుంచి లాచుంగ్‌లో ఉన్న యుమ్థాంగ్ వాలీకి వెళ్లే దారిలో ఈ వాటర్‌ఫాల్ ఉంటుంది. ఈ ఫాల్స్‌ను భిమ్నాలా లేదా భెవ్మా ఫాల్స్ అని కూడా అంటారు.
నిజానికి తన పేరు మీద ఒక వాటర్‌ఫాల్ ఉందనే విషయం 2019 వరకు బిగ్‌బీకి కూడా తెలియదు. ఓ ట్విట్టర్ యూజర్.. ఈ వాటర్‌ఫాల్స్‌ను సందర్శించిన తర్వాత.. ఆ ఫోటోలను ట్విట్టర్లో అమితాబ్‌కు ట్యాగ్ చేశాడు. దీంతో అమితాబ్ ఆ వాటర్‌ఫాల్‌ను చూసి.. దానికి తన పేరు పెట్టారని తెలుసుకొని ఆశ్చర్యపోయారు.
నార్త్ ఈస్ట్ అందాలను ఆస్వాదించడానికి వెళ్లేవాళ్లు.. అత్యంత ఎత్తైన పర్వతం కాంచన్గంగాను సందర్శించాలనుకునే వాళ్లు.. అక్కడి ఉపఉష్ణమండల వాతావారణాన్ని ఎంజాయ్ చేయడానికి వెళ్లేవాళ్లు, అక్కడి జీవవైవిధ్యాన్ని ఎంజాయ్ చేయానుకునేవాళ్లు.. ఖచ్చితంగా అమితాబ్ బచ్చన్ వాటర్ ఫాల్స్‌ను కూడా సందర్శించాల్సిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
చలిగిలిలో.. ప్రకృతి ఒడిలో.. హనీమూన్ ట్రిప్స్‌కు పెరిగిన డిమాండ్
Winter Tour : చలికాలంలో టూర్ ఎంజాయ్ చేయాలంటే.. తెలంగాణలోనే ఉన్న ఈ ప్లేస్‌కు వెళ్లాల్సిందే
Bhongir Fort | తెలంగాణలో ట్రెక్కింగ్‌కు కేరాఫ్ భువనగిరి కోట.. దాని ప్రత్యేకతలు తెలుసా?