e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, November 27, 2021
Home News Bhongir Fort | తెలంగాణలో ట్రెక్కింగ్‌కు కేరాఫ్‌ భువనగిరి కోట.. దాని ప్రత్యేకతలు తెలుసా?

Bhongir Fort | తెలంగాణలో ట్రెక్కింగ్‌కు కేరాఫ్‌ భువనగిరి కోట.. దాని ప్రత్యేకతలు తెలుసా?

Bhongir Fort | bhuvanagiri fort

Bhongir Fort | ఎన్నో పోరాటాలకు, ఎంతో చరిత్రకు చిహ్నమైన తెలంగాణ రాష్ట్రంలో చెక్కు చెదరని నిర్మాణంగా, చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుంది భువ‌న‌గిరి కోట‌ ( Bhongir Fort ) . దాదాపు 3000 ఏళ్ల నాటి ఈ దుర్గం ఎన్నో ఆశ్చర్యపరిచే నిర్మాణాలకు సౌధం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంతో ఇక్కడ పర్యాటక ప్రాముఖ్యత రోజు రోజుకూ పెరుగుతుంది. తెలంగాణ పర్యటనకు వచ్చే టూరిస్టులు హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్, బిర్లా మందిర్ వంటి వాటితో పాటు చార్మినార్, గోల్కొండ కోట వంటి చారిత్రక ప్రదేశాల సందర్శనకు ఆసక్తి చూపుతుంటారు. కేవలం హైదరాబాద్ నగరంలోనే కాదు తెలంగాణలో అనేక ప్రాంతాల్లో ఇటువంటి చారిత్రక కట్టడాలు అనేకం కనిపిస్తాయి. వాటిలో ముఖ్యమైన ప్రదేశాల్లో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న భువ‌న‌గిరి కోట‌ ( bhuvanagiri fort ) ఒకటి.

భువనగిరి కోట చరిత్ర

భువనగిరి కోట ( Bhongir fort ) చరిత్ర

జానపదులలో భువనగిరి దుర్గం, భువనగిరి నగరంలపై పలు కథ‌లు ప్రచారంలో ఉన్నాయి. చాళుక్య వంశానికి చెందిన ఓ రాజు రాయగిరి వద్ద మల్లన్న గుట్టపై కోట కడుతుండగా బోనయ్య అనే గొల్ల వ్యక్తి… ఇక్కడ కోట ఏమి కడతారు కానీ నేనొక చోటు చూపిస్తా అని భువనగిరి గుట్టను చూపించాడట. ఈ పర్వతపు అందాలకు ముగ్ధుడైన రాజు రాయగిరిలో కోటను కట్టడం ఆపి ఇక్కడ ఖిల్లాను నిర్మించాడట. ఇంత అద్భుతమైన చోటు చూపించిన బోనయ్యకు రాజు ఇనాములివ్వగా, వాటిని సున్నితంగా తిరస్కరించి తన పేరును, తన భార్య గిరమ్మ పేరును కలిపి ఒక ఊరు నిర్మించాలని కోరాడట. రాజు వారి పేర్లపై నిర్మించిన నగరమే నేడు భువనగిరిగా సంస్కృతీకరించబడిందని కథ‌నం. అయితే ఈ జానపద కథ‌కు చారిత్రక ఆధారాలు ఏవీ లేవు.

భువనగిరి కోట
- Advertisement -

భువనగిరి దుర్గం 3 వేల ఏళ్లకు ముందే నిర్మించబడిందని, తెలంగాణను ఏలిన అందరి పాలనలో భువనగిరి ప్రాంతం ఉన్నట్లు చరిత్రకారులు చెబుతుంటారు. అయితే భువనగిరి కోటకు ముందే ఈ ప్రాంతంలో మానవ ఆవాస చిహ్నాలు ఉన్నట్లు పురాతత్వ పరిశోధకులు చెబుతున్నారు. ఇక్కడ మధ్యపాతరాతియుగం నాటి బొరిగెలు, బాణాలు, రాతి గొడ్డళ్లు, కత్తులు, సమాధులు బయటపడ్డాయి. అలాగే మధ్యరాతియుగం నాటి మానవ నివాస జాడలు, నవీన శిలాయుగం నాటి మానవ ఆవాసాలను కనుగొన్నారు. భువనగిరి కోట కుతుబ్ షాహీల పరిపాలనలో చాలా కాలం ఉంది. తరువాత 1687లో మొఘలులు గోల్కొండను ఆక్రమించినప్పుడు వారి ఏలుబడిలోకి వచ్చింది.

సర్వాయి పాపడు

తెలంగాణలో సాధారణ కల్లు గీత కుటుంబంలో పుట్టిన సర్వాయి పాపడు 1708లో ఓరుగల్లును గెలుచుకుని తరువాత భువనగిరిని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. గోల్కొండను గెలవడానికి ముందు ఇక్కడ తన అపార ధనరాశులను కొండ అంతర్భాగంలో ఉన్న కాళికా మాత ఆలయంలో దాచి ఉంచాడట. ఈ కొండలో ఇప్పటికీ కనుగొనబడని అనేక గుహలు, సొరంగాలు ఉన్నట్లు చెప్పుకుంటారు. ఇక్కడ విష్ణుకుండినుల కాలం నాటి నాణేలు లభ్యమైనట్లు చరిత్రకారులు పేర్కొన్నారు.

Bhongiri fort

భువ‌న‌గిరి కోట‌ ప్రత్యేకతలు

హైదరాబాద్ నగరానికి 47 కిలోమీటర్ల దూరంలో ఏకశిల రాతి గుట్టపై నిర్మించిన ప్రాచీన కట్టడం భువనగిరి కోట ( bhuvanagiri fort ). 610 మీటర్ల ఎత్తైన ఈ కొండ తెలంగాణలోని ఉర్లుకొండ, ఉండ్రుకొండ, అనంతగిరుల కంటే ఎత్తైనది. అండాకారపు ఏకశిలా పర్వతమైన ఈ కొండ దక్షిణం నుంచి చూస్తే తాబేలులా, పడమర నుంచి చూస్తే పడుకున్న ఏనుగులా కనిపిస్తుంది. ఇది బాలాఘాట్ పంక్తులలోని అనంతగిరి వరుసలలోనిది. భువనగిరి కోటను పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన 6వ త్రిభువన మళ్లా విక్రమాదిత్య పాలనలో నిర్మించినట్లు చెబుతారు. ఆయన పేరు మీదనే దీనిని భువనగిరి కోటగా పిలుస్తారని, ఇది కాకతీయుల కాలంలో బాగా ప్రసిద్ధి చెందినట్లు చరిత్రకారుల కథ‌నం.

Bhongiri fort

ఈ కొండకు నైరుతి, ఆగ్నేయ దిశల నుంచి పైకి వెళ్లే మార్గాలు ఉన్నాయి. ప్రస్తుత మార్గం నైరుతి నుంచే ప్రారంభం అవుతుంది. భువనగిరి కోట మొదటి ద్వారాన్ని ఉక్కు ద్వారం అంటారు. ఈ ద్వారాన్ని నిజాం తన సొంత ఖర్చుతో నిర్మించినట్లు చెబుతారు. ఈ ప్రవేశ ద్వారం గోల్కొండ కోటలోని బాలాహిస్సార్ మొదటి ద్వారం ఫతే దర్వాజాను పోలి ఉంటుంది. ఎత్తైన గోడలు, విశాలమైన గదులు ఇస్లాం సంస్కృతి నిర్మాణశైలిలో కనిపిస్తాయి.

భువ‌న‌గిరి ఇప్పుడు ట్రెక్కింగ్‌ ( Trekking in Telangana )కు కేరాఫ్‌గా మారింది

కోట లోపలి ప్రాకారాల్లో గుర్రపు కొట్టాలు, ధాన్యాగారాలు, సైనికాగారాలు ఉన్నాయి. రాజాప్రాసాదాల క్రింద శిలాగర్భంలో ఎన్నో అంతుచిక్కని రహస్య మార్గాలు ఉన్నాయి. ఈ సొరంగాలు ఎక్కడికి వెళ్తాయో ఇప్పటికీ ఎవరూ కనుగొనలేకపోయారని చెబుతారు. వీటితో పాటు అంతఃపురం పరిసరాల్లో నీళ్లను నిల్వ చేసుకునే రాతి తొట్టెలు, చాళుక్యుల శిల్పరీతిని ప్రతిబింబించే రాజప్రాసాదాలు, పుష్పాలంకరణలు, కాకతీయ శైలిలో అనేక శిల్పా కళాకృతులు చెక్కబడ్డాయి. భువనగిరి కొండపై ఒక శివాలయం, నల్లని నంది విగ్రహం, కొండ కింద పచ్చలకట్ల సోమేశ్వరుడు, బమ్మదేవర ఆలయం, ఒక మఠం ఉంటాయి. కాలక్రమంలో కొండపై కొన్ని దేవాలయాలు శిధిలమై గుట్ట లోయల్లో పడి ఉండడం మనం గమనించవచ్చు. కోట బురుజుపైనుండి చుట్టుపక్కల ప్రదేశాలను చూడవచ్చు

భువ‌న‌గిరి ఇప్పుడు ట్రెక్కింగ్‌ ( Trekking in Telangana )కు కేరాఫ్‌గా మారింది

Trekkingకు అనుకూలం

భువ‌న‌గిరి ఇప్పుడు ట్రెక్కింగ్‌ ( Trekking in Telangana )కు కేరాఫ్‌గా మారింది. 500 అడుగుల ఎత్తులో 40 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ప్రదేశం పర్వతారోహణకు ఎంతో అనువైనది. ఈ కొండపైకి చేరుకోవడానికి దాదాపు గంట సమయం పడుతుంది. కాబట్టి మీ వెంట తగినంత మంచి నీటిని కూడా తీసుకువెళ్లండి. అక్టోబర్ నుంచి మార్చివ‌ర‌కు సందర్శనకు అనువైన సమయం.

bhongir fort

ఎక్క‌డ ఉంది?

భువనగిరి కోట ( bhuvanagiri fort ) యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి పట్టణంలో ఉంది. ఏకశిలపై నిర్మించబడిన ఈ ధృడమైన కోట 300 అడుగుల ఎత్తులో ఉంది.

Bhuvanagiri fort

ఎలా వెళ్లాలి..?..

భువనగిరి హైదరాబాద్ కు 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ భువనగిరి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి వెళ్లే కొన్ని రైళ్లు భువనగిరిలో ఆగుతాయి. ఇక హైద‌రాబాద్ నుంచి వ‌రంగ‌ల్ వెళ్లే బ‌స్సులు భువ‌న‌గిరి గుండానే వెళ్తాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

క‌రీంన‌గ‌ర్‌లోని ఈ గుట్ట‌ల‌ వల్లే తెలుగు భాష‌కు ప్రాచీన హోదా వచ్చిందా?

Mystery | ఈ ఊళ్లో ఒక‌రు పోతే.. వారంలో ఇంకొక‌రు చావాల్సిందే.. వంద‌ల ఏళ్లుగా ఇదే సీన్‌

కొండల్లో దారి తప్పిన వ్యక్తి.. ఎన్ని ఫోన్లు చేసినా ఎత్తలేదు.. కారణం ఏం చెప్పాడంటే

116 ఏండ్లు గడిచినా చెక్కుచెదరని గడీ.. ఓ రైతు కట్టుకున్న ఇంద్ర భవనం ఎక్కడుందో తెలుసా?

33 ఏండ్లు మారుమూల‌ దీవిలో ఏకాంతవాసం.. ఇప్పుడు న‌గ‌రంలో కొత్త జీవితం..!

myrtle corbin | నాలుగు కాళ్లు.. రెండు జ‌న‌నేంద్రియాలు.. ఆమె పుట్టుక‌ ఇప్ప‌టికీ మిస్ట‌రీనే

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement