e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home News myrtle corbin | నాలుగు కాళ్లు.. రెండు జ‌న‌నేంద్రియాలు.. ఆమె పుట్టుక‌ ఇప్ప‌టికీ మిస్ట‌రీనే

myrtle corbin | నాలుగు కాళ్లు.. రెండు జ‌న‌నేంద్రియాలు.. ఆమె పుట్టుక‌ ఇప్ప‌టికీ మిస్ట‌రీనే

myrtle corbin | ఆమె ఒక్క‌రా ! ఇద్ద‌రా ! ఒక్కరిలా క‌నిపించే ఇద్ద‌రా !! ఏమో ఎవ‌రికి తెలుసు !! అస‌లు ఈ పిచ్చి ప్ర‌శ్న ఏంట‌ని అనుకుంటున్నారా ! ఆమె గురించి తెలిస్తే మీరు కూడా ఇలాగే అనుకుంటారు !! ఎందుకంటే న‌డుం పైభాగం వ‌ర‌కు ఆమె చూడ్డానికి ఒక్క‌రిలానే క‌నిపిస్తుంది. కానీ ఆ కింద‌నే ఇద్ద‌రిలా ఉంటుంది. కింద నుంచి అన్నీ రెండేసి అవ‌య‌వాలు ఉంటాయి. అదేంటి అనుకుంటున్నారా.. నిజంగానే ఆమెకు నాలుగు కాళ్లు.. రెండు జ‌న‌నేంద్రియాలు ఉన్నాయి. ఇలాంటి మ‌నిషి ఎక్క‌డైనా బ‌తుకుతుందా అనే డౌట్ వ‌స్తుంది క‌దూ ! కానీ ఒక‌టి కాదు.. రెండు కాదు.. దాదాపు 60 ఏండ్లు బ‌తికింది. ఐదుగురు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. అంతేకాదు ఆ ఐదుగురు బిడ్డ‌లు కూడా ఆమె వేర్వేరు గ‌ర్భాశ‌యాల నుంచి పుట్ట‌డం విశేషం.

మైర్‌ట్లే కార్బిన్.. ఆమె వైద్య శాస్త్రానికి ఓ మిరాకిల్‌. ఆమె జీవితం ఇప్ప‌టికీ అంతుచిక్క‌ని మిస్ట‌రీనే. ఎందుకంటే జ‌న్యులోపాల కార‌ణంగా.. వింతగా జ‌న్మించిన శిశువు బ‌తికే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయి. కానీ 1868లో అమెరికాలోని టెన్నెసీలో పుట్టిన కార్బిన్ దాదాపు 60 ఏండ్లు జీవించింది. పిండం స‌రిగ్గా వృద్ధి చెంద‌క‌పోవ‌డం వ‌ల్ల క‌వ‌ల‌లుగా పుట్టాల్సిన శిశువులు ఒక్క‌రిగా పుట్టార‌ని.. ఇది అరుదైన డిపైగ‌స్ అని అప్ప‌ట్లో డాక్ట‌ర్లు నిర్ధారించారు. ఈమె న‌డుము భాగం వ‌ర‌కు సాధార‌ణంగా ఉండేది. ఆమె అందగత్తె కూడా. ముఖం కూడా చంద్రబింబంలా వెలిగిపోయేది. చూడచక్కటి అందమైన రూపం కలిగి ఉన్నప్పటికీ నడుం కింద నుంచి రెండేసి జతల అవయవాలు ఉండేవి. న‌డుం కింద భాగం నుంచి కార్బిన్‌కు నాలుగు కాళ్లు, రెండు జ‌న‌నేంద్రియాలు, రెండు గ‌ర్భాశ‌యాలు ఉన్నాయి. అయితే నాలుగు కాళ్లు ఉన్న‌ప్ప‌టికీ వాటిలో రెండు కాళ్లు పొడ‌వుగా.. మ‌రో రెండు కాళ్లు పొట్టిగా ఉండేవి. వీటిలో మూడు కాళ్లు చాలా బ‌ల‌హీనంగా ఉండ‌టం వ‌ల్ల న‌డ‌వ‌డం సాధ్య‌మ‌య్యేది కాదు. కానీ ఆ రూప‌మే కార్బిన్‌కు వ‌ర‌మైంది.

- Advertisement -

చ‌నిపోతుంద‌నుకున్న బిడ్డ బ‌త‌క‌డంతో అప్ప‌టి ప‌త్రిక‌ల్లో కార్బిన్‌ గురించి త‌ర‌చూ వార్త‌లు వ‌చ్చేవి. దీంతో చిన్న‌వ‌య‌సులోనే ఆమె సెలబ్రెటీగా మారిపోయింది. ఆమె క్రేజ్‌ను క్యాష్ చేసుకోవ‌డానికి ఒక స‌ర్క‌స్ కంపెనీ కార్బిన్‌ను త‌మ టీమ్‌లో చేర్చుకుంది. ఆ రోజుల్లో ఆమె వారానికి సుమారు 450 డాల‌ర్లు సంపాదించేది.19 ఏళ్ల వ‌య‌సులో క్లింట‌న్ బిక్నెల్ అనే డాక్ట‌ర్‌.. కార్బిన్‌ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి త‌ర్వాత ఆమె స‌ర్క‌స్‌లో ప‌నిచేయ‌డం మానేసింది. ఆ త‌ర్వాత కొద్ది రోజుల‌కు ఉన్న‌ట్టుండి ఆమె ఎడ‌మ వైపు క‌డుపులో నొప్పి వ‌చ్చింది. దీంతో ప‌రీక్షించిన వైద్యులు కార్బిన్‌ గ‌ర్భ‌వ‌తి అని తేల్చారు. అంతేకాదు ఆమెకు రెండు గ‌ర్భాశ‌యాలు ఉన్నాయ‌నే విష‌యాన్ని కూడా అప్పుడే గుర్తించారు. మొత్తానికి ఆమె న‌లుగురు ఆడ‌పిల్ల‌లు, ఒక మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. వారంతా కూడా సాధార‌ణంగానే ఉండ‌టం విశేషం.

1928లో కార్బిన్ కుడికాలికి స్ట్రెప్టోకోక్స‌ల్ ఇన్ఫెక్ష‌న్ సోకింది. అప్ప‌ట్లో దానికి చికిత్స లేదు. ఆ వ్యాధి సోకిన వారం రోజుల‌కే కార్బిన్ మ‌ర‌ణించింది. అంటే కార్బిన్ త‌న 60వ పుట్టిన రోజుకు ఒక వారం ముందే చ‌నిపోయింది. ఆమె మ‌ర‌ణం కూడా అప్ప‌ట్లో సంచ‌లనంగా మారింది. కార్బిన్ భౌతిక కాయాన్ని ప‌రిశోధ‌న‌ల నిమిత్తం అప్ప‌గిస్తే భారీగా న‌గదు ఇస్తామ‌ని అప్ప‌ట్లో ప‌లు వైద్య బృందాలు ఆమె కుటుంబ‌స‌భ్యుల‌ను అడిగారంట‌. కానీ అందుకు కార్బిన్ కుటుంబ స‌భ్యులు ఒప్పుకోలేదు. పైగా స‌మాధి చేసిన త‌ర్వాత కార్బిన్ పార్థివ దేహాన్ని దొంగిలిస్తారేమోన‌ని ఆమె కుటుంబ‌స‌భ్యులు కాంక్రీట్‌తో ఆమె స‌మాధిని క‌ట్టించారు. ఆ కాంక్రీట్ గ‌ట్టి ప‌డేవ‌ర‌కు కూడా అక్కడే కాపాలా ఉన్నార‌ట‌.
19వ శ‌తాబ్దంలో వైద్య శాస్త్రం ఇంత అభివృద్ధి చెంద‌క‌పోవ‌డంతో ప‌రిశోధ‌కులు కార్బిన్ శ‌రీరం గురించి పూర్తిగా తెలుసుకోలేక‌పోయారు. ఆమెకు రెండు జ‌త‌ల కాళ్లు, రెండు జ‌న‌నేంద్రియాలు, రెండు గర్భ‌సంచిలు ఉన్న‌ట్లే మిగిలిన అవ‌య‌వాలు కూడా రెండేసి ఉన్నాయేమో అన్న అనుమానం చాలామందిలో ఉండేది. అప్ప‌ట్లో ఆమెకు పుట్టిన పిల్ల‌లు కూడా ఒకే క‌డుపున పుట్ట‌లేద‌ని.. రెండే వేర్వేరే గ‌ర్భాశ‌యాల ద్వారా జ‌న్మించార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఈ విష‌యాన్ని కార్బిన్ కుటుంబీకులు ర‌హ‌స్యంగా ఉంచేశారు. దీంతో ఆమె జ‌న్మ ర‌హ‌స్యం ఇప్ప‌టికీ మిస్ట‌రీగానే మిగిలిపోయింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

మ‌న‌కు ‘రా’ ఇంటెలిజెన్స్‌.. మ‌రి పాక్‌, చైనా దేశాల‌ నిఘా సంస్థ‌ల గురించి తెలుసా?

ఫైన‌ల్‌లో పాకిస్థాన్‌ను ఓడించి ప్ర‌పంచ‌క‌ప్ తెచ్చాడు.. ఇప్పుడు కూలీగా మారాడు

ఆ ఊరిపెద్ద భారత్‌లో భోజనం చేస్తాడు.. మయన్మార్‌లో నిద్రపోతాడు!

Whistle village : ఆ ఊళ్లో పేర్లు ఉండ‌వ్‌.. విజిల్‌తోనే పిలుచుకుంట‌రు

కొంప‌ముంచిన సెల‌బ్రెటీల ట్వీట్లు.. ఒక్కో పోస్టుతో వేల‌ కోట్ల రూపాయ‌లు ఆవిరి !

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana